Begin typing your search above and press return to search.

ఫ్యాన్ మూమెంట్: జక్కన్నతో శృతి!

అందులో భాగంగానే ఇప్పుడు శృతిహాసన్ కూడా తన ఫేవరెట్ సెలబ్రిటీతో ఫోటో దిగి మరీ షేర్ చేస్తూ.. ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అంటూ ఫోటోని షేర్ చేసుకుంది.

By:  Madhu Reddy   |   15 Nov 2025 12:53 PM IST
ఫ్యాన్ మూమెంట్: జక్కన్నతో శృతి!
X

ప్రతి ఒక్కరు ఎవరో ఒకరిని అభిమానిస్తూ ఉంటారు. అది సినిమా ఇండస్ట్రీలో అయినా సరే లేదా ఇతర రియల్ లైఫ్ లో అయినా సరే.. ఇక ఫ్యాన్స్ అనగానే ఎక్కువ గుర్తుకు వచ్చేది సినిమా ఇండస్ట్రీ వారికే. సినిమా ఇండస్ట్రీలో ఉండే ఎంతో మంది హీరో హీరోయిన్లకు,డైరెక్టర్లకు, సింగర్లకు అభిమానులు ఉంటారు. ఇకపోతే సెలబ్రిటీలకు అభిమానులు ఉండడమే కాదు ఆ సెలబ్రిటీలకు కూడా ఫేవరెట్ సెలబ్రిటీలు ఉంటారనడంలో సందేహం లేదు. అలా ఇప్పటికే ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు తమ అభిమాన సెలబ్రిటీల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. అందులో భాగంగానే ఇప్పుడు శృతిహాసన్ కూడా తన ఫేవరెట్ సెలబ్రిటీతో ఫోటో దిగి మరీ షేర్ చేస్తూ.. ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అంటూ ఫోటోని షేర్ చేసుకుంది.




విషయంలోకి వెళ్తే.. శృతిహాసన్ రీసెంట్ గా రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఎస్ఎస్ఎంబి 29 మూవీకి సంబంధించిన సంచారి అనే సాంగ్ ని పాడిన సంగతి మనకు తెలిసిందే. మహేష్ బాబు పాత్రని ఎలివేట్ చేస్తూ సంచారి అనే సాంగ్ ని మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి.. చైతన్య ప్రసాద్ తో అద్భుతంగా రాయించారు. ఈ అద్భుతమైన పాటకి శృతిహాసన్ తన గొంతుతో ప్రాణం పోసింది. అలా సైలెంట్ గా వచ్చిన సంచారి సాంగ్ సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో సంచలనం క్రియేట్ చేస్తోంది.

అయితే మహేష్ బాబు నటించిన మూవీలో పాట పాడి భాగమైన శృతిహాసన్ తాజాగా రాజమౌళితో ఉన్న ఫోటోలు షేర్ చేసుకొని ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అంటూ రాసుకొచ్చింది.

అయితే రాజమౌళికి శృతిహాసన్ పెద్ద వీరాభిమానట. అలా ఆయన్ని కలవడంతో ఇది ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అంటూ సోషల్ మీడియాలో ఈ ఫోటోని షేర్ చేసి తెగ సంబరపడిపోయింది. ప్రస్తుతం శృతిహాసన్ షేర్ చేసిన ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది శృతిహాసన్ ఈ పోస్ట్ పై కామెంట్లు పెడుతున్నారు.. అలా శృతిహాసన్ తన అభిమాన డైరెక్టర్ ని కలుసుకొని.. ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

శృతిహాసన్ హీరోయిన్ గానే కాకుండా గాయనిగా కూడా ఇండస్ట్రీకి తెలుసు. సినిమాల్లోకి గాయనిగా ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. ఒకప్పుడు వరుస ఫ్లాప్ లతో ఐరన్ లెగ్ హీరోయిన్ గా పేరు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ.. గబ్బర్ సింగ్ మూవీతో స్టార్డం సంపాదించింది.ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్న శృతిహాసన్.. చాలా రోజుల తర్వాత ఎస్ఎస్ఎంబి 29 మూవీ కోసం సంచారి అనే సాంగ్ పాడి మరొకసారి సింగర్ గా అవతారం ఎత్తింది. ఈ పాటకి అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు శృతిహాసన్ వాయిస్ ని పొగుడుతున్నారు. శృతిహాసన్ రీసెంట్ గానే రజినీకాంత్ నటించిన కూలీ మూవీలో కీ రోల్ పోషించింది.