గ్లోబ్ ట్రాటర్: కీరవాణితో శ్రుతి హాసన్ ఇలా..
అయితే, ఈ రికార్డింగ్ సెషన్‌లో జరిగిన ఒక స్పెషల్ మూమెంట్ గురించి శ్రుతి హాసన్ హార్ట్ ఫుల్ గా రాసుకొచ్చింది. ఆ పోస్ట్‌లో, "నేను స్టూడియోలో సైలెంట్‌గా కూర్చుని కీరవాణి గారు కీబోర్డ్ ప్లే చేయడం వింటున్నాను.
By: M Prashanth | 10 Nov 2025 10:09 PM ISTరాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న 'గ్లోబ్ ట్రాటర్' SSMB29 ఫీవర్ అప్పుడే స్టార్ట్ అయింది. నవంబర్ 15న జరగబోయే ఈవెంట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుండగా, జక్కన్న టీమ్ మొన్న విలన్ 'కుంభ' పోస్టర్‌ను, రీసెంట్ గా 'గ్లోబ్ ట్రాటర్' థీమ్ సాంగ్‌ను వదిలి హైప్ పీక్స్‌కు తీసుకెళ్లింది. ఇక ఆ థీమ్ సాంగ్‌లో వినిపించిన ఆ హస్కీ, పవర్‌ఫుల్ వాయిస్ శ్రుతి హాసన్‌దే కావడం మరో హైలెట్.
"కీరవాణి గారి మ్యూజికల్‌లో పాడటం చాలా ఆనందంగా ఉంది. వాట్ ఎ పవర్‌ఫుల్ ట్రాక్.." అంటూ శ్రుతి హాసనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ వేసి కన్ఫర్మ్ చేసింది. ఆస్కార్ విన్నర్ కీరవాణితో రికార్డింగ్ స్టూడియోలో ఉన్న ఫోటోలను, ఒక ఫన్నీ వీడియోను కూడా ఆమె షేర్ చేసుకుంది. ఈ అప్‌డేట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జయిట్ అవుతున్నారు.
అయితే, ఈ రికార్డింగ్ సెషన్‌లో జరిగిన ఒక స్పెషల్ మూమెంట్ గురించి శ్రుతి హాసన్ హార్ట్ ఫుల్ గా రాసుకొచ్చింది. ఆ పోస్ట్‌లో, "నేను స్టూడియోలో సైలెంట్‌గా కూర్చుని కీరవాణి గారు కీబోర్డ్ ప్లే చేయడం వింటున్నాను. ఆయన నాతో 'నేను ఏ సెషన్ అయినా మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వర మంత్రంతో స్టార్ట్ చేస్తాను' అని చెప్పారు. సరే, ఆయన అదే ప్లే చేస్తున్నారేమో అని నేను అనుకున్నాను" అని శ్రుతి చెప్పింది.
"కానీ, ఒక్కసారిగా ఆ ట్యూన్ వినగానే నాకు అర్థమైంది.. అది 'అప్పా' (నాన్న కమల్ హాసన్) సాంగ్! ఆ మూమెంట్ నాకెంతో స్పెషల్" అంటూ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేసింది. కీరవాణి.. తన రొటీన్ మంత్రం కాకుండా, శ్రుతిని కంఫర్టబుల్‌గా ఫీల్ చేయడానికి, ఆమె తండ్రి కమల్ హాసన్ ఐకానిక్ సాంగ్‌ను ప్లే చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారట. ఈ మ్యూజిక్ శ్రుతిని చాలా టచ్ చేసిందట.
ఆ వీడియోలో కూడా కీరవాణి ఆ పాటను ప్లే చేస్తుండగా, శ్రుతి నవ్వుతూ సిగ్గుపడింది. 'గ్లోబ్ ట్రాటర్' లాంటి ఒక గ్లోబల్ అడ్వెంచర్ థీమ్ యాంథమ్‌కు శ్రుతి హాసన్ వాయిస్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పాలి. ఆమె వాయిస్‌లో ఉండే ఆ వెస్ట్రన్ పాప్ రాక్ స్టైల్, ఆ హస్కీనెస్.. సినిమా ఇంటర్నేషనల్ వైబ్‌కు కరెక్ట్‌గా యాప్ట్ అయ్యాయి. మొన్న 'కుంభ' పోస్టర్, ఇప్పుడు శ్రుతి హాసన్ పాడిన ఈ పవర్‌ఫుల్ థీమ్ సాంగ్.. నవంబర్ 15న జరగబోయే 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్‌కు ముందు జక్కన్న హైప్‌ను మరో లెవెల్ కు తీసుకెళ్లాడు. ఇక ఈవెంట్‌లో జక్కన్న ఏం మాయ చేస్తాడో చూడాలి.
