హీరోయిన్ నుంచి కథను మలుపు తిప్పే పాత్రలకా?
విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్ ఆరంభంలో తడబడినా? ఆ తర్వాత మొల్లగా నిలదొక్కుకుంది.
By: Srikanth Kontham | 29 Jan 2026 1:55 PM ISTవిశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్ ఆరంభంలో తడబడినా? ఆ తర్వాత మొల్లగా నిలదొక్కుకుంది. హీరోయిన్ గా ఒక్కో మెట్టు ఎక్కి సక్సస్ ను అందుకుంది. డాడ్ ఇమేజ్ నుంచి బయటకొచ్చి సినిమాలు చేసే స్థాయికి ఎదిగింది. వైవిథ్యమైన పాత్రలు, ప్రయోగాల పరంగానూ శ్రుతి ఏనాడు వెనకడుగు వేసింది లేదు. ఏ భాషలో అవకాశం వచ్చినా కాదనుకుండా పని చేసింది. తమిళ్, తెలుగు సహా హిందీలో పని చేసింది. అయి తే శ్రుతి హాసన్ కెరీర్ తాజాగా పరిశీలిస్తే మునుపటిలా సాగలేదు అన్నది అంతే వాస్తవం.
అమ్మడు హీరోయిన్ గా వెండి తెరపై కనిపించి మూడేళ్లు అవుతుంది. 2023 లో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించిన రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవే చిరంజీవితో కలిసి `వాల్తేరు వీరయ్య`, బాలకృష్ణతో కు జోడీగా `వీర సింహారెడ్డి`లోనూ నటించింది. అదే ఏడాది నాని నటించిన `హాయ్ నాన్న`లో స్పెషల్ అప్పిరియన్స్ తో అలరించింది. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన `సలార్ సీజ్ ఫైర్` లో కీలక పాత్రలో అలరించింది. ఆ తర్వాత శ్రుతి హీరోయిన్ గా నటించిన చిత్రం ఒక్కటీ థియేటర్లో లేదు. గత ఏడాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `కూలీ`లో కీలక పాత్రలో కనిపించింది.
రెండేళ్ల గ్యాప్ తర్వాత చేసిన చిత్రమది. ప్రస్తుతం `ఆకాశంలో ఒక తార` అనే చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే `ట్రైన్` అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. `సైలెంట్ సీరమ్స్` అనే ఓ డాక్యుమెంటరీలోనూ నటిస్తోంది. మొత్తంగా ఈ మూడేళ్ల కెరీర్ ని పరిశీలిస్తే అమ్మడు హీరోయిన్ పాత్రల నుంచి ప్రత్యేక పాత్రధారిగా మారి డెమోషన్ అయిందని అర్దమవుతుంది. హీరోయిన్ గా బిజీగా చేయాల్సిన శ్రుతి హాసన్ స్టార్స్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి నెట్టింట వైరల్ గా మారింది. మరి తదుపరి చిత్రంతోనైనా అమ్మడు పుంజుకునే అవకాశం ఉందా? అంటే సన్నివేశం అలా కనిపించలేదు.
శ్రుతి హాసన్ ఖాతాలో ప్రాజెక్ట్ `సలార్ 2` ఒక్కటే. ఇందులో అమె పాత్రకు ప్రాధాన్యత ఉంటుందా? ఉండదా? అన్నది చెప్పడం కష్టం. సహజంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉండదు. `కేజీఎఫ్` లో శ్రీనిధిశెట్టి పాత్ర ప్రాధాన్యత తెలిసిందే. ప్రస్తుతం తారక్ తో తీస్తోన్న సినిమా విషయంలో రుక్మిణీ వసంత్ రోల్ పై ఇదే అంశంగా చర్చగా మారింది. తాజాగా `సలార్ 2`లో నటిస్తోన్న శ్రుతి హాసన్ విషయంలో చర్చకు దారీ తీస్తోన్న అంశం అదే.
