బ్లాక్ అంటే అందుకే ఇష్టం.. సీక్రెట్ రివీల్ చేసిన శృతిహాసన్!
నిజానికి శృతిహాసన్ ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేసిందంటే చాలు ఆమె ప్రతి ఫోటో దాదాపు నలుపు రంగులోనే ఉంటుంది.
By: Madhu Reddy | 13 Aug 2025 12:07 PM ISTప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సింగర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే మొదట పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దాంతో ఐరన్ లెగ్ అనే ముద్ర వేసుకుంది. ఇక పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలు ప్రకటిస్తూ బిజీగా మారిపోయింది శృతిహాసన్.
సలార్ సినిమాతో పాన్ ఇండియా బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. బాలకృష్ణతో వీరసింహారెడ్డి, చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాలు చేసి ఒకే ఏడాది బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచింది. దీనికి తోడు ఇప్పుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'కూలీ' సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈమె.. తనకు ఇష్టమైన కలర్ గురించి.. ప్రత్యేకించి ఆ కలర్ ను ఇష్టపడడం వెనుక అసలు కారణాలు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
నిజానికి శృతిహాసన్ ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేసిందంటే చాలు ఆమె ప్రతి ఫోటో దాదాపు నలుపు రంగులోనే ఉంటుంది. సుమారు 90 శాతం ఫోటోలు ఈ బ్లాక్ కలర్ లోనే కనిపిస్తాయి. దీన్ని బట్టి చూస్తే ఈమెకు నలుపు అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నలుపు రంగు దుస్తులు ధరించడం వెనుక అసలు కారణాన్ని చెబుతూ.. బ్లాక్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనం ఈ కలర్ వేసుకుంటే ఎంతమందిలో.. ఎక్కడ ఉన్నా చాలా ప్రత్యేకంగా కనిపిస్తాము. ముఖ్యంగా నా స్కిన్ టోన్ కి ఆ రంగు మరింత అద్భుతంగా సూట్ అవుతుంది.
వాస్తవానికి నలుపు చాలామంది అశుభంగా పరిగణిస్తారు. కానీ నాకు మాత్రం ఇది ఒక సెంటిమెంట్ గా మారిపోయింది. బ్లాక్ డ్రెస్ వేసుకున్నప్పుడు నాలో ఎక్కడలేని ధైర్యం వస్తుంది. ఇక మిగతా రంగులతో పోల్చుకుంటే బ్లాక్ డ్రెస్ వేసుకున్నప్పుడు నేను మరింత రెట్టింపు ఉత్సాహంగా ఉంటాను. దీనికి తోడు డార్క్ కలర్స్ వేసుకున్నప్పుడు బయటకు వెళ్తే మరకలు పడినా ఎవరికీ సులభంగా కనిపించవు. అందుకే ఒక బెస్ట్ ఛాయిస్ గా నేను బ్లాక్ కలర్ ను ఎంచుకున్నాను" అంటూ సరదాగా చెప్పుకొచ్చింది శృతిహాసన్. ఇకపోతే శృతిహాసన్ స్కిన్ టోన్ కి ఈ కలర్ నిజంగా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె ధరించే ప్రతి బ్లాక్ డ్రెస్ కూడా ఆమె అందాన్ని మరింత హైలెట్ చేస్తాయని చెప్పవచ్చు. ఇక ప్రత్యేక ఆకర్షణగా నలుగురిలో నిలవడానికి ఈ ముద్దుగుమ్మ ఇలా ఈ కలర్ ను ఎంపిక చేసుకున్నానని చెప్పుకొచ్చింది. ఇక బ్లాక్ కలర్ తో పాటు డార్క్ కలర్స్ ఏవైనా సరే తనకు ఇష్టమే అంటూ కూడా చెప్పుకొచ్చింది.
