Begin typing your search above and press return to search.

బర్తడే స్పెషల్.. 43 ఏళ్ల ప్రాయంలో వైట్ బికినీలో సూర్యుడికే చెమటలు పట్టించిన శ్రియ!

శ్రియ శరణ్.. తాజాగా తన 43వ పుట్టినరోజు వేడుకలను ఆమె ఘనంగా జరుపుకున్నారు. భర్త, కూతురు సమక్షంలో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ మరింత సంతోషంగా కనిపించారు.

By:  Madhu Reddy   |   11 Sept 2025 10:52 PM IST
బర్తడే స్పెషల్.. 43 ఏళ్ల ప్రాయంలో వైట్ బికినీలో సూర్యుడికే చెమటలు పట్టించిన శ్రియ!
X

శ్రియ శరణ్.. తాజాగా తన 43వ పుట్టినరోజు వేడుకలను ఆమె ఘనంగా జరుపుకున్నారు. భర్త, కూతురు సమక్షంలో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ మరింత సంతోషంగా కనిపించారు. తన 43వ పుట్టినరోజు సందర్భంగా బాలపిటియాలో సముద్ర తీరాన తన భర్త ఆండ్రీ కోస్చీవ్, కూతురు రాధా తో కలిసి సమయాన్ని గడిపారు. ఇందులో వైట్ కలర్ బికినీలో సూర్యుడికి సైతం చెమటలు పట్టేలా తన అందంతో మరింత గ్లామర్ వలకబోసింది ఈ ముద్దుగుమ్మ. ఇబికినీలో తాను ఫోజులు ఇవ్వడమే కాకుండా తన కూతురితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది.

నీటి జలకన్యలా ఫోటోలకు ఫోజులిస్తూ.. మరింత ఆకర్షణగా నిలిచింది శ్రియా శరణ్. మొత్తానికైతే బర్తడే సందర్భంగా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. బికినీలో అమ్మడి అందాలు మరింత హీట్ పుట్టిస్తున్నాయి అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా శ్రియ తన కుటుంబంతో కలిసి షేర్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని చెప్పవచ్చు.

శ్రియ శరన్ విషయానికి వస్తే.. 'ఇష్టం' సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. 1992 సెప్టెంబర్ 11న ఉత్తరాఖండ్లో జన్మించింది. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన శ్రియ.. హిందీ, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అలా చెన్నకేశవరెడ్డి, సంతోషం, ఠాగూర్ ,నీకు నేను నాకు నువ్వు, నువ్వే నువ్వే, నేనున్నాను, నీ మనసు నాకు తెలుసు ఇలా చాలా చిత్రాలలో నటించిన ఈమె హీరోయిన్ గానే కాకుండా ' పవిత్ర' అనే సినిమాలో ఒక వేశ్య పాత్రలో కూడా నటించి.. అందరిని ఆశ్చర్యపరిచింది.

హీరోయిన్గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేయడం మొదలుపెట్టింది. ఇకపోతే వివాహం చేసుకొని.. కరోనా సమయంలో ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చిన ఈమె.. వివాహం అనంతరం అనగా 2018 నుంచి 2023 వరకు సినీ ఇండస్ట్రీకి దూరంగానే ఉంది. ఇక 2023లో కబ్జా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం తేజ సజ్జ హీరోగా నటిస్తున్న మిరాయ్ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది శ్రియ శరన్. ఈ పాత్ర ఈమె కెరీర్ కు మరింత క్రేజ్ తెచ్చిపెడుతుందని అభిమానులు సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

శ్రియ శరన్ పెళ్లి విషయానికొస్తే 2018 మార్చి 19న రష్యన్ ప్రియుడు, వ్యాపారవేత్త అయిన ఆండ్రీ కోస్చీవ్ ను లోఖండ్ వాలాలోని తన నివాసంలో వివాహం చేసుకుంది. ఈ వివాహం అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య మాత్రమే జరిగింది. అయితే ఈమెకు పెళ్లైన విషయం ఎవరికీ తెలియలేదు. దీనికి తోడు మధ్యలో కరోనా రావడంతో ఈ విషయం రహస్యంగానే ఉండిపోయింది. కానీ కరోనా వచ్చినప్పుడు.. అంటే 2021 జనవరిలో ఈమెకు కూతురు పుట్టింది. పాప పెద్దయ్యాక కూతురిని పరిచయం చేసింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. పెళ్లి కాకుండానే కూతురేంటి అంటూ విషయం తెలియని వాళ్ళు విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి ఇంత రహస్యంగా ఎలా మెయింటైన్ చేశావు అంటూ కామెంట్లు చేయడం గమనార్హం.