బీచ్ సైడ్ బికినీ అందాలతో హీట్ పుట్టిస్తున్న శ్రియా!
43 సంవత్సరాల వయసులో కూడా తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ గ్లామర్ డోస్ తో అభిమానులను అలరిస్తోంది శ్రియా శరణ్.
By: Madhu Reddy | 15 Feb 2026 12:29 AM IST43 సంవత్సరాల వయసులో కూడా తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ గ్లామర్ డోస్ తో అభిమానులను అలరిస్తోంది శ్రియా శరణ్. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూనే.. మరొకవైపు తన అందంతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా కొన్ని ఫోటోలు పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. బీచ్ సైడ్ బికినీ ధరించి.. అందాలు ఆరబోస్తూ అభిమానుల గుండెల్లో గుబులు పుట్టించింది .ముఖ్యంగా ఈమె గ్లామర్ ఫోటోలు చూసి హీటెక్కిపోతున్నారు. అంతలా తన అందంతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది శ్రియా శరణ్. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
1982 సెప్టెంబర్ 11న హరిద్వార్లో జన్మించిన శ్రియా ఇష్టం అనే సినిమాతో టాలీవుడ్ సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత సంతోషం సినిమాతో కమర్షియల్ గా విజయాన్ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో అనేక చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రియా శరణ్.. 2003లో తుజే మేరీ కసం అనే సినిమాతో హిందీ రంగ ప్రవేశం చేసింది. ఇంకా తెలుగు, హిందీతో పాటు తమిళ్ చిత్రాలలో కూడా నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటుంది. కెరియర్ పీక్స్ లో ఉండగానే 2018లో ఇండస్ట్రీకి దూరమై.. ఆండ్రీ తో ఏడడుగులు వేసింది. ఇక 2021లో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తన కూతురికి రాధా అని నామకరణం కూడా చేసింది.
ఈమధ్య కాలంలో తన కూతురితో కలిసి ఇంస్టాగ్రామ్ వేదికగా ఫోటోలు పంచుకుంటూ ఆ పాపకి కూడా ఊహించని క్రేజ్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అజయ్ దేవగన్ సరసన నటించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈమె రీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా.. అలా అభిమానుల ఆకలి కూడా తీర్చేసిందని చెప్పవచ్చు.
అలాగే తేజ సజ్జ హీరోగా వచ్చిన మిరాయ్ అనే పాన్ ఇండియా సినిమాలో కూడా నటించి తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో మరోసారి అందరి దృష్టిని ఆకట్టుకుంది. అలా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. ఇప్పుడు కూడా అదే స్పీడులో అవకాశాలు అందుకోవడం నిజంగా గొప్ప విషయం అనే కామెంట్లు వ్యర్థమవుతున్నాయి. మరోవైపు ఈ వయసులో కూడా తన అందాలతో కుర్ర హీరోయిన్లకి పోటీ ఇస్తూ మరింత బిజీగా మారింది ఈ ముద్దుగుమ్మ.
శ్రియ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. దృశ్యం 3 హిందీ చిత్రంలో నటిస్తోంది అలాగే నకుల్ మెహతాతో కలిసి నటించిన డిజిటల్ ప్రాజెక్టు స్పేస్ జెన్ చంద్రయాన్ లో కూడా నటిస్తోంది. అలాగే మరో రెండు చిత్రాలు లైన్లో పెట్టినట్లు సమాచారం.
