ఇప్పటికీ అదే గ్లామ్ షో.. శ్రీయ శరణ్ ఉఫ్.. ఉఫ్..!
శ్రీయ శరణ్ ఇప్పటికీ కూడా తన గ్లామర్ షోతో అదరగొట్టేస్తుంది. ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోలందరితో నటించిన ఈ అమ్మడు పెళ్లి తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తుంది.
By: Ramesh Boddu | 13 Nov 2025 1:01 PM ISTశ్రీయ శరణ్ ఇప్పటికీ కూడా తన గ్లామర్ షోతో అదరగొట్టేస్తుంది. ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోలందరితో నటించిన ఈ అమ్మడు పెళ్లి తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తుంది. ముఖ్యంగా ఎలాంటి రోల్స్ అయినా చేయడానికి శ్రీయ ఎప్పుడు రెడీగా ఉంటుంది. రీసెంట్ గా మిరాయ్ సినిమాలో ఆమె చేసిన రోల్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఆ సినిమా తర్వాత ఈసారి తన గ్లామర్ తో మెస్మరైజ్ చేయడానికి వస్తుంది అమ్మడు. మెట్రో శిరీష్ లీడ్ రోల్ లో నటిస్తున్న నాన్ వైలెన్స్ సినిమా నుంచి కనకం అనే వీడియో సాంగ్ రిలీజైంది.
కనకం సాంగ్ లో శ్రీయ గ్లామర్ షో..
యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో కనకం సాంగ్ లో శ్రీయ గ్లామర్ షో కుర్రాళ్లను అలరిస్తుంది. ఈ సాంగ్ ను భాస్య శ్రీ రచించిన ఈ పాటను యువన్ శంకర్ రాజా, తేజశ్విని నందిభట్ల ఆలపించారు. ఆనంద కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ నాన్ వైలెన్స్ సినిమా నుంచి కనకం సాంగ్ యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా శ్రీయ గ్లామర్ షో ఆఫ్టర్ లాంగ్ టైం ఆమె ఫ్యాన్స్ ని ఖుషి అయ్యేలా చేస్తుంది.
నాన్ వైలెన్స్ సినిమాలో శ్రీయ స్పెషల్ సాంగ్ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు తన నటనతో ఆడియన్స్ ని మెప్పించిన శ్రీయ ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలు తగ్గించింది. ఐతే కూతురు పుట్టిన తర్వాత కూడా తన లుక్స్ విషయంలో ఏమాత్రం డిజప్పాయింట్ చేయట్లేదు శ్రీయ. అందుకే ఆమెతో ఈ సాంగ్ చేయించారు. కనకం సాంగ్ లో శ్రీయని చూసిన ఆడియన్స్ ఆమె ఇంకా హీరోయిన్ గా కూడా చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు.
శ్రీయ లుక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు..
పెళ్లై ఒక పాప పుట్టిన తర్వాత కూడా శ్రీయ తన ఫిజిక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఐతే ఈ స్పెషల్ సాంగ్ తో శ్రీయ తన క్రేజ్ ని మరోసారి చూపించబోతుంది. నాన్ వైలెన్స్ లో శ్రీయ సాంగ్ ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. మరి ఈ సాంగ్ సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతుంది అన్నది చూడాలి. శ్రీయ మాత్రం సాంగ్స్ మాత్రమే కాదు తనకు సూటయ్యే ఎలాంటి రోల్స్ అయినా చేయడానికి రెడీ అని చెబుతుంది.
సీనియర్ స్టార్స్ కి హీరోయిన్స్ దొరకని టైం లో శ్రీయ వారికి బెస్ట్ ఆప్షన్ అయ్యింది. ఐతే ఇప్పుడు సీనియర్స్ తో కూడా స్టార్ హీరోయిన్స్ జతకడుతున్నారు కాబట్టి శ్రీయకు పెద్దగా ఛాన్స్ లు రావట్లేదు. ఐతే వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా శ్రీయ వదలకుండా తన టాలెంట్ తో మెప్పిస్తూ వస్తుంది. లేటెస్ట్ గా నాన్ వైలెన్స్ అనే సినిమాలో అమ్మడు స్పెషల్ సాంగ్ తో మరోసారి తన గ్రేస్ చూపించబోతోంది.
