సూపర్ ఛాన్స్.. నాలుగు పదులు దాటినా ముద్దుగుమ్మ అదే జోష్
సినిమా ఇండస్ట్రీలో 'ఇష్టం' సినిమాతో పాతిక ఏళ్ల క్రితం అడుగు పెట్టిన శ్రియ ఇప్పటి వరకు సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది.
By: Ramesh Palla | 25 Aug 2026 1:44 PM ISTసినిమా ఇండస్ట్రీలో 'ఇష్టం' సినిమాతో పాతిక ఏళ్ల క్రితం అడుగు పెట్టిన శ్రియ ఇప్పటి వరకు సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది. ఏడాదికి రెండు మూడు సినిమాల్లో కనిపించడం ద్వారా తన తరం హీరోయిన్స్ మాత్రమే కాకుండా ఈతరం హీరోయిన్స్ సైతం నోరు వెళ్లబెట్టి మరీ చూసే విధంగా చేస్తుంది. శ్రియ కెరీర్ ఖతం అయినట్లే అనుకున్న ప్రతిసారి వరుస సినిమాల్లో నటించడం ద్వారా లైన్‌లోనే ఉన్నట్లుగా చెప్పకనే చెబుతూ వస్తుంది. శ్రియ ఈ మధ్య కాలంలో హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా కథలో కీలకమైన పాత్రలు, గెస్ట్ రోల్స్, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను సైతం చేస్తూ వస్తుంది. గత ఏడాది రెట్రో, మిరాయ్ సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా మిరాయ్ సినిమాలో శ్రియ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అంతే కాకుండా సినిమాకు శ్రియ హీరో అని చాలా మంది సైతం కామెంట్స్ చేసిన విషయం తెల్సిందే.
రజనీకాంత్‌తో శ్రియ మూవీ...
ఇక ఈ ఏడాదిలో ఇప్పటికే సందక్కారి అనే తమిళ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాతో మరోసారి తమిళ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది. ప్రస్తుతం ఈమె చేతిలో మరో రెండు మూడు తమిళ సినిమాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా బాబీ ప్రధాన పాత్రలో నటిస్తున్న నాన్ వైలెన్స్ సినిమాలో శ్రియ కీలక పాత్రలో కనిపించబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా గురించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తాజాగా శ్రియ మరో తమిళ మూవీని కన్ఫర్మ్ చసింది. రజనీకాంత్‌తో కలిసి ఉన్న ఫోటోను శ్రియ షేర్ చేయడం ద్వారా తన కొత్త సినిమాను ప్రకటించినట్లు అయింది. గతంలో రజనీకాంత్‌తో శ్రియ సినిమా చేసిన విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన శివాజీ మూవీ హాలీవుడ్ రేంజ్‌లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ కాంబో రిపీట్ కాబోతుంది.
అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ధర్మన్..
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ధర్మన్ అనే సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రామ్ కీలక పాత్రలో నటించబోతున్నాడు అనే వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఆ వార్తల్లో నిజం ఎంత అనే విషయమై క్లారిటీ రాలేదు, కానీ ధర్మన్ సినిమాలో తాను కనిపించబోతున్నట్లుగా శ్రియ ఒక ఫోటోను షేర్ చేయడం ద్వారా క్లారిటీ ఇచ్చింది. మొన్నటి వరకు ధర్మన్ రెండో షెడ్యూల్ జరిగింది. తాజాగా హైదరాబాద్‌లో ధర్మన్ మూడో షెడ్యూల్‌ను ప్రారంభించారు అనే విషయం తెల్సిందే. రజనీకాంత్‌తో పాటు ముఖ్య నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం శ్రియ హైదరాబాద్‌లో ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆమె స్వయంగా రజనీకాంత్‌తో ఉన్న ఫోటోను షేర్ చేయడం ద్వారా ధర్మన్‌లో ఆమె నటిస్తున్న విషయం కన్ఫర్మ్ అయింది.
రజనీకాంత్ ధర్మన్ మూవీలో..
శ్రియ వయసు నాలుగు పదులు దాటి కూడా చాలా కాలం అయింది. సాధారణంగా ఈ వయసులో హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి, అమ్మగా, అత్తగా లేదంటే అక్క, వదిన పాత్రల్లో నటిస్తారు. కానీ శ్రియ మాత్రం ఇంకా హీరోలతో రొమాన్స్ చేసే పాత్రలను చేయడంతో పాటు, కథలో అత్యంత కీలకమైన పాత్రలు మాత్రమే చేస్తుండటం విశేషం. అయిదు పదుల వయసు వచ్చే వరకు శ్రియ హీరోయిన్‌గానే సినిమాలు చేసే అవకాశం ఉన్నట్లుగా ఆమె జోరు చూస్తూ ఉంటే అనిపిస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రజనీకాంత్‌తో ఉన్న ఫోటోను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన శ్రియ హ్యాపీ డే అంటూ పోస్ట్ చేసింది. అంటే రజనీకాంత్‌తో ఆమె షూటింగ్‌లో పాల్గొంటున్నట్లుగా కన్ఫర్మ్ అయింది. సూపర్ స్టార్‌తో షూటింగ్‌లో ఒక్క రోజు పాల్గొన్నా అది కచ్చితంగా హ్యాపీడే అవుతుంది. అందుకే శ్రియ ఇది తనకు హ్యాపీ డే అంటూ ఫోటోను షేర్ చేయడం జరిగింది. మరి ధర్మన్ లో శ్రియ పాత్ర ఏంటి? ఎంత సమయం కనిపిస్తుంది? అనేది సినిమా విడుదలైతే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
