Begin typing your search above and press return to search.

పిక్ నిక్ టైమ్.. ఫ్యామిలీతో చిల్ అవుతున్న స్టార్ హీరోయిన్!

ఈ క్రమంలోనే తాజాగా మరో స్టార్ హీరోయిన్ పిక్నిక్ కి వెళ్ళింది. తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న మధుర క్షణాలకు సంబంధించిన ఫోటోలను కెమెరాలో బంధించి అభిమానులతో పంచుకుంది.

By:  Madhu Reddy   |   22 Jun 2026 1:36 PM IST
పిక్ నిక్ టైమ్.. ఫ్యామిలీతో చిల్ అవుతున్న స్టార్ హీరోయిన్!
X

నిత్యం వరుస సినిమాలు, ప్రమోషన్స్, యాడ్స్ అంటూ క్షణం తీరిక లేకుండా బిజీగా గడిపేస్తున్న ఎంతోమంది సెలబ్రిటీలు కాసింత సమయం దొరికితే చాలు.. కుటుంబంతో సరదాగా గడపాలని అనుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే అలా విరామం దొరికిందో లేదో ఇలా ఫ్యామిలీతో వెకేషన్ కి చెక్కేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను, అక్కడి ప్రాంతాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా మరో స్టార్ హీరోయిన్ పిక్నిక్ కి వెళ్ళింది. తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న మధుర క్షణాలకు సంబంధించిన ఫోటోలను కెమెరాలో బంధించి అభిమానులతో పంచుకుంది.




ఆమె ఎవరో కాదు శ్రియా శరణ్.. తాజాగా తన భర్త ఆండ్రీ కోశ్చీవ్ అలాగే తన కూతురు రాధాతో కలసి పిక్నిక్ లో భాగంగా ఒక రిసార్ట్లో సందడి చేశారు. కాశ్మీరీ స్టైల్ లో దుస్తులు ధరించి ఆ వేషధారణతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఇక ఈ మధ్యకాలంలో తరచుగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న శ్రియా మరొకసారి ఇలా పిక్నిక్ పేరిట తన కూతురు, భర్తతో కలిసి వెకేషన్ కి వచ్చింది. అక్కడ ముద్దులతో తన ఫ్యామిలీని ముంచేస్తూ దిగిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటోంది. ఏదీ ఏమైనా శ్రియా శరణ్ తాజాగా షేర్ చేసిన ఈ లేటెస్ట్ ఫోటోషూట్ బాగా ఆకట్టుకుంటోంది..




శ్రియ విషయానికొస్తే ఈమె గొప్ప డాన్సర్. అందులో భాగంగానే డాన్సర్ కావాలని ఎన్నో కలలు కంది. కానీ డెస్టినీ ఆమెను నటిగా మార్చేసింది. అలా తొలిసారి 2001లో ఇష్టం అనే తెలుగు చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి నటన జీవితాన్ని మొదలుపెట్టింది.ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందించలేదు. కానీ 2002లో నాగార్జున హీరోగా వచ్చిన సంతోషం సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించి మొదటి కమర్షియల్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది.




ఇక ఆ తర్వాత నేనున్నాను, ఛత్రపతి ఇలా పలు తెలుగు చిత్రాలు చేసి తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈమె గ్లామర్ వలకబోస్తూ హీరోయిన్గా ఆకట్టుకోవడమే కాకుండా పవిత్ర లాంటి చిత్రాలలో వ్యాంప్ పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. కెరియర్ లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో ఇండస్ట్రీకి దూరమై పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తాను పెళ్లి చేసుకున్న విషయాన్ని అభిమానులతో పంచుకొని సర్ప్రైజ్ చేసింది.




ఇక ఈ మధ్యకాలంలో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె ఇప్పుడు వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూ.. మరింత బిజీగా మారిపోయింది. అందులో భాగంగానే తేజ సజ్జా హీరోగా నటించిన సినిమాల్లో హీరో తల్లి పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఏది ఏమైనా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది శ్రియా శరణ్.