అదెప్పుడూ ఇబ్బందనిపించలేదు!
మొదట్నుంచి కూడా టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లు తక్కువగానే ఉండేవారు. అందుకే పక్క భాషల నుంచి హీరోయిన్లను తీసుకురావడం కామన్ అయిపోయింది.
By: Sravani Lakshmi Srungarapu | 1 Feb 2026 5:00 AM ISTమొదట్నుంచి కూడా టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లు తక్కువగానే ఉండేవారు. అందుకే పక్క భాషల నుంచి హీరోయిన్లను తీసుకురావడం కామన్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఎంతోమంది వేరే భాషల నుంచి వచ్చిన భామలు తెలుగులో సత్తా చాటారు. చాటుతూనే ఉన్నారు. అలాంటి వారిలో హరిద్వార్ కు చెందిన శ్రియా శరణ్ కూడా ఒకరు.
సౌత్ స్టార్ హీరోల సరసన నటించిన శ్రియా
శ్రియా నార్త్ అమ్మాయి అయినప్పటికీ సౌత్ లో ఆమె రెండు దశాబ్దాల పాటూ ఓ వెలుగు వెలిగారు. ఇక్కడి లాంగ్వేజ్, కల్చర్ కొత్త అయినప్పటికీ శ్రియా సౌత్ లోని స్టార్ హీరోలందరి సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా తనదైన ముద్ర వేయగలిగారు. ఇంకా చెప్పాలంటే, తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న శ్రియ సౌత్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.
సౌత్ స్టార్ గా గుర్తింపు
ఇష్టం మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రియా తర్వాత ఛత్రపతి, శివాజీ, మనం లాంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించారు. హిందీలో కూడా శ్రియ పలు హిట్ సినిమాల్లో నటించారు కానీ, శ్రియాకు ఎక్కువగా సౌత్ నుంచే గుర్తింపు రావడంతో ఆమె నార్త్ భామ్ అయినప్పటికీ సౌత్ హీరోయిన్ అనే అంటుంటారు. ఈ ట్యాగ్ పై శ్రియా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
మనసు కూడా సౌత్ ఇండియన్ గా మారింది
ఆడియన్స్ తనను సౌత్ స్టార్ అని పిలవడం తనకెప్పుడూ ఇబ్బందిగా అనిపించలేదని, నిజానికి సౌత్ ఆడియన్స్ తనపై కురిపించిన ప్రేమ వెలకట్టలేనిదని, ఇప్పుడు తన మనసు కూడా పూర్తిగా సౌత్ ఇండియన్ గా మారిపోయిందని శ్రియా చెప్పుకొచ్చారు. కాగా శ్రియా శరణ్ తాజాగా ఓ వెబ్‌సిరీస్ చేయగా, ఆ వెబ్‌సిరీస్ ప్రమోషన్స్ లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
శ్రియా చేసిన కామెంట్స్ పై ఆమె ఫ్యాన్స్ అందరూ ఎంతో సంతోషిస్తుండగా, శ్రియ సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ అయ్యారని, అందులో భాగంగానే ఇప్పుడు మళ్లీ ఆమె టాలీవుడ్ ను టార్గెట్ చేస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా శ్రియాకు సౌత్ లో ఉన్న ఫాలోయింగ్, క్రేజ్ చాలా ఎక్కువనే సంగతి అందరికీ తెలిసిన విషయమే.
