Begin typing your search above and press return to search.

బ్లాక్ అవుట్ ఫిట్ లో సెగలు పుట్టిస్తున్న శ్రియా శరణ్!

44 ఏళ్ల వయసులోనూ హీరోయిన్ శ్రియా శరణ్ తన గ్లామర్‌తో ఆకట్టుకుంటోంది. తాజాగా బ్లాక్ కలర్ స్ట్రాప్‌లెస్ షిమ్మర్ డ్రెస్‌లో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. స్టడ్ చెవిపోగులు, మెటాలిక్ బ్రాస్‌లెట్‌తో స్టైలిష్ లుక్‌లో మెరిసింది. ప్రస్తుతం ఆట నాదే వేట నాదే సినిమాతో పాటు పలు ప్రాజెక్టుల్లో నటిస్తోంది.

By:  Madhu Reddy   |   20 Nov 2026 10:56 PM IST
బ్లాక్ అవుట్ ఫిట్ లో సెగలు పుట్టిస్తున్న శ్రియా శరణ్!
X

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న సీనియర్ స్టార్ హీరోయిన్స్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు తమ అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మలు ఇప్పటికే అదే అందం ,చురుకుదనంతో మెప్పిస్తున్నారు అంటే ఇంత గ్లామర్ వెనుక వారు పడుతున్న కష్టమేంటో అర్థమవుతుంది. నిత్యం యోగా సెంటర్లలో , జిమ్ సెంటర్లలో బరువులు మోస్తూ.. కష్టమైన వ్యాయామాలు చేస్తూ తమ శరీర ఆకృతులను అలాగే మైంటైన్ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.




ఈ క్రమంలోనే అలాంటి ముద్దుగుమ్మలలో శ్రియా శరణ్ కూడా ఒకరు. 44 సంవత్సరాల వయసులో కూడా స్వీట్ 16 అనిపించేలా తన అందం,అభినయంతో మెప్పిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మళ్లీ బిజీ అయిపోయిన శ్రియా శరణ్.. తాజాగా గ్లామర్ వలకబోస్తూ షేర్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.




ఈ మేరకు తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా గ్లామర్ వలకబోస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. శ్రియా శరణ్ తాజాగా బ్లాక్ కలర్ స్ట్రాప్ లెస్ షిమ్మర్ బాడీ ఖాన్ డ్రెస్ ధరించింది. డ్రెస్ మొత్తం చిన్న సీక్వెన్స్ వర్క్ తో లైటింగ్ లో అందంగా మెరుస్తూ ఈమె అందాన్ని రెట్టింపు చేసింది. ఈ డ్రెస్ కి జతగా చిన్న స్టడ్ చెవి పోగులు ధరించిన ఈమె.. మెటాలిక్ బ్రాస్లెట్ ఉంగరాలు కూడా ధరించింది. మొత్తానికైతే ఇలాంటి అవుట్ ఫిట్ ఎక్కువగా కాక్ టెయిల్ పార్టీలు, ఈవినింగ్ రిసెప్షన్ లో నైట్ ఈవెంట్లకు చాలా గ్రాండ్ గా ఉంటాయని చెప్పవచ్చు. మొత్తానికి అయితే 44 ఏళ్ల ప్రాయంలో కూడా అందం, అభినయంతో ఆకట్టుకుంటూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.




శ్రియా శరణ్ విషయానికి వస్తే.. ఉత్తరాఖండ్ కి చెందిన ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు మోడల్గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఇక ఇష్టం సినిమాతో తొలిసారి వెండితెరకు పరిచయమైన శ్రియా శరణ్ .. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి, సంతోషం, ఠాగూర్, నువ్వే నువ్వే, నీకు నేను నాకు నువ్వు, నేనున్నాను ఇలా పలు చిత్రాలలో హీరోయిన్గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. చివరిగా ఇక 2018లో గాయత్రి అనే సినిమాలో నటించి వెండితెరకు దూరమైన ఈమె.. మళ్లీ 2023లో కబ్జా అనే చిత్రంలో నటించి ఆకట్టుకుంది. ఇకపోతే ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో అజయ్ దేవగన్ భార్యగా నటించిన శ్రియా శరణ్.. 2025లో మిరాయ్ సినిమాతో ఆకట్టుకుంది.

తేజ దర్శకత్వంలో వస్తున్న ఆట నాదే వేటా నాదే అనే చిత్రంలో నటిస్తున్న ఈమె స్పేస్ జెన్: చంద్రయాన్ అనే టీవీ సిరీస్ లో నటిస్తోంది .అలాగే తమిళ్ అహింసా మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు సమాచారం.