వాటర్ లేకపోయినా సెగనపిండి తప్పనిసరి!
ఫిట్ నెస్..బ్యూటీ విషయంలో సెలబ్రిటీల కేరింగ్ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. జిమ్, యోగా క్రమం తప్పకుండా చేస్తారు.
By: Srikanth Kontham | 31 Aug 2025 10:00 PM ISTఫిట్ నెస్..బ్యూటీ విషయంలో సెలబ్రిటీల కేరింగ్ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. జిమ్, యోగా క్రమం తప్పకుండా చేస్తారు. డైటీషన్, న్యూట్రీషన్లు వెంట ఉంటారు. సెలబ్రిటీలో లైఫ్ స్టైల్లో ఇవి ఓ భాగం. ఇలాంటి విషయాల్లో శ్రియ మరింత కేర్ పుల్ గా ఉంటుంది. 42 ఏళ్ల వయసులో ఓ బిడ్డకు తల్లైనా అమ్మడు ఇప్పటికీ అదే బ్యూటీని మెయింటెన్ చేస్తుంది. సినిమా అవకాశాలు అందుకుంటుంది. శ్రియ జనరేషన్ హీరోయిన్లు చాలా మంది సినిమాలు వదిలేసి వేర్వురు వృత్తుల్లో స్థిరపడినా? శ్రియ మాత్రం ఇప్పటికీ వెండి తెరపై మెరుస్తూనే ఉంది.
కీలక పాత్రలు..గెస్ట్ అప్పిరియన్స్ లు..ఐటం పాటల్లో నటిస్తూ అభిమానుల్ని అలరిస్తుంది. గత ఏడాది ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాకపోయే సరికి శ్రియ కూడా రిటైర్మెంట్ తీసుకుందా? అన్న ప్రచారం తెరపైకి వచ్చింది. కానీ అంతలోనే సూర్య `రెట్రో` సినిమాలో అవకాశం కల్పించారు. దీంతో 2025 లో ఆ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఆ తర్వాత మళ్లీ ఖాళీ అయినట్లే కనిపిస్తోంది. ఆ సంగతి పక్కన బెడితే తాజాగా అమ్మడు బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసింది.
అందం, ఆరోగ్యం, ఫిట్ నెస్ ఈ మూడు సొంతమవ్వాలంటే? ఆహారం విషయంలో కచ్చితంగా ఉండా లంటోంది. ఒకేసారి కాకుండా రెండు గంటలకు ఒకసారి తింటానంది. బాదం, వేయించిన బాదం గింజలు, పండ్లు తప్పనిసరి. ఉదయాన్నే నారిజం జ్యూస్ క్రమం తప్పకుండా తాగుతుందిట. యోగా, ధ్యానం చేస్తా నంది. అలాగే సెనగపిండిలో పెరుగు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తుందిట. కొంత సమయం అలాగే ఉంచేసి రోజ్ వాటర్ తో కడుగుతుందిట. తన అందానికి ప్రధానమైన సీక్రెట్ ఇదేనని తెలిపింది.
తాను ఎక్కడికి వెళ్లినా? వెంట త్రాగడానికి వాటర్ బాటిల్ లేకపోయినా? సెనగ పిండి , రోజ్ వాటర్ తప్పని సరిగా ఉం టుందంది. తన బ్యాగులో కచ్చితంగా ఆ రెండు ఉండేలా మాత్రం చూసుకుంటుదిట. ఇని స్టెంట్ గా ముఖాన్ని కాంతి వంతంగా మార్చాలంటే? సెనగపిండి ఉంటే చాలంది. అదన్న మాట శ్రియ బ్యూటీ సీక్రెట్. ఈ బ్యూటీకి టాలీవుడ్ లో తొలుత చాన్స్ ఇచ్చింది దివంగత రామోజీరావు అన్న సంగతి తెలిసిందే.
