Begin typing your search above and press return to search.

వ‌య‌సు ఒక నంబ‌ర్ మాత్ర‌మే.. శ్రీ‌య ది గ్రేట్!

ఫిట్‌నెస్, అందంతో శ్రియా శరణ్ మరోసారి సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోషూట్ చిత్రాలు వైరల్ అవుతున్నాయి. ‘దృశ్యం 3’ హిందీ చిత్రంతో విజయాన్ని అందుకున్న శ్రియా ప్రస్తుతం ‘నాన్ వయలెన్స్’ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. కుటుంబం, కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

By:  Sivaji Kontham   |   21 Nov 2026 3:22 PM IST
వ‌య‌సు ఒక నంబ‌ర్ మాత్ర‌మే.. శ్రీ‌య ది గ్రేట్!
X

అందం- ఫిట్ నెస్ విష‌యంలో శ్రీ‌య‌శ‌ర‌ణ్ నేటిత‌రం భామలకు గట్టి పోటీనిస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారుతున్నారు. వివాహమై- పిల్లలు ఉన్నా ఈ భామ‌లో ఏమాత్రం తర‌గ‌ని అందం, నాజూకైన లుక్ చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. అదే గ్రేస్.. అదే ఉత్సాహంతో కెమెరా ముందు నిలబడుతూ తన స్టైలిష్ ఫోటోషూట్‌లతో అభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. శ్రియాను చూస్తుంటే వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని.. మనసును ఉల్లాసంగా ఉంచుకుంటే అందం ఎప్పటికీ చెక్కుచెదరదని మరోసారి నిరూపితమవుతోంది.

తాజాగా విడుదలైన ఫోటో గ్యాలరీలోనూ శ్రియా తన ఆకర్షణీయమైన లుక్స్‌తో నెటిజన్ల దృష్టిని గొప్ప‌గా ఆకర్షిస్తున్నారు. డ్యాన్స్‌తో పాటు యోగా, ఫిట్‌నెస్ రొటీన్‌ను అనుస‌రించ‌డంలో శ్రీ‌య ఎప్పుడూ బ్రేక్ ఇవ్వ‌రు. ఇలాంటి క్ర‌మ‌శిక్ష‌ణ‌తోనే శరీరంలో ఎప్పుడూ చురుకుదనం.. ముఖంలో సహజమైన మెరుపు కనిపిస్తుంటాయని సినీ వర్గాలు, అభిమానులు ప్రశంసిస్తుంటారు. ఎలాంటి దుస్తుల‌లోనైనా సులభంగా ఒదిగిపోతూ.. ఆత్మవిశ్వాసంతో కూడిన చిరునవ్వుతో క‌నిపించే శ్రీ‌య ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

తాజాగా శ్రీ‌య షేర్ చేసిన అంద‌మైన ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అవుతోంది. ఈ ఫోటోగ్రాఫ్స్ లో సింపుల్ స్మైల్ తో శ్రీ‌య క‌ట్టిప‌డేస్తోంది.

గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ శ్రియా సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ దూసుకుపోతున్నారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన `దృశ్యం 3` హిందీ చిత్రంలో తన నటనతో మెప్పించిన ఈ బ్యూటీ ఆ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో మరింత ఉత్సాహంగా ఉన్నారు. ఓవైపు ఫ్యామిలీ.. మ‌రోవైపు కెరీర్ రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ శ్రీ‌య త‌న జీవితాన్ని ఆస్వాధిస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది.

ప్రస్తుతం శ్రియా `నాన్ వయలెన్స్` అనే ప్రాజెక్ట్‌లో నటిస్తూ బిజీగా ఉన్నారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త‌న‌ పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మొత్తానికి పెళ్లి, పిల్లల తర్వాత కూడా చెరగని అందంతో అదే ఎనర్జీతో ముందుకు సాగుతున్న శ్రియా శరణ్.. కెరీర్ ప‌రంగాను ఇలాగే మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.