స్టైలిష్ మూవీలో ఊర మాస్ లుక్ తో షాక్
కానీ ఓజిలో శ్రియా రెడ్డి క్యారెక్టర్ చాలా మాస్ గా ఉండనుందని రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది.
By: Sravani Lakshmi Srungarapu | 20 Sept 2025 6:11 PM ISTగతంలో పొగరు, అమ్మ చెప్పింది, అప్పుడప్పుడు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించిన శ్రియా రెడ్డి సుమారు పదేళ్ల తర్వాత సలార్ సినిమాలో సిల్వర్ స్క్రీన్ పై కనిపించి అందరినీ మెస్మరైజ్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత శ్రియా మళ్లీ సలార్ సినిమాలో కనిపించడంతో ఆమె నటనకు, స్క్రీన్ ప్రెజెన్స్ కు ఆడియన్స్ నుంచి చాలా ప్రశంసలొచ్చాయి.
ఓజిలో కీలకపాత్రలో శ్రియారెడ్డి
కాగా పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వస్తోన్న ఓజి సినిమాలో కూడా శ్రియా రెడ్డి కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓజి సినిమాలో తన క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉండనుందని శ్రియా ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఓజిలో శ్రియా రెడ్డి క్యారెక్టర్ కూడా స్టైలిష్ గానే ఉంటుందని అంతా అనుకున్నారు.
ఫస్ట్ లుక్ తో షాకిచ్చిన శ్రియా
కానీ ఓజిలో శ్రియా రెడ్డి క్యారెక్టర్ చాలా మాస్ గా ఉండనుందని రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఓజిలో శ్రియా రెడ్డి గీత అనే క్యారెక్టర్ లో కనిపించనుండగా, సినిమాలో ఆమె రోల్ మరింత పవర్‌ఫుల్ గా, చాలా మాస్ గా ఉంటుందని తెలుస్తోంది. పాత్ర ఏదైనా శ్రియా దానికి 100% ఇస్తారు. అలాంటిది పవర్ స్టార్ సినిమా అంటే ఈసారి అమ్మడు తన యాక్టింగ్ తో ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో చూడ్డానికి అందరూ వెయిట్ చేస్తున్నారు.
ఓజి ఎమోషనల్ రోలర్ కోస్టర్
కాగా గతంలో ఓజి సినిమాలో తన పాత్ర గురించి చెప్తూ, ఇందులో తన క్యారెక్టర్ చాలా రియలిస్టిక్ గా ఉంటుందని, తన లుక్ తో పాటూ క్యారెక్టర్‌కి కూడా మంచి ఇంపాక్ట్ ఉండటం వల్ల టాలెంట్ ను బయటపెట్టే ఛాన్స్ వచ్చిందని, ఓజి మూవీలో తన పాత్రకు మంచి పేరు దక్కుతుందని చెప్పారు. అంతేకాదు, అందరూ అనుకున్నట్టు ఇది కేవలం కమర్షియల్ మూవీ మాత్రమే కాదని, ఎమోషనల్ రోలర్ కోస్టర్ కూడా అని శ్రియా పేర్కొన్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
