Begin typing your search above and press return to search.

శ్రేయా ఘోషల్‌తో క‌పూర్ బ్యూటీ మ్యూజికల్ జర్నీ!

బెంగళూరులో జరిగిన శ్రేయా ఘోషల్ లైవ్ కాన్సర్ట్‌లో శ్రద్ధా కపూర్ అనూహ్యంగా వేదికపైకి వచ్చారు. ‘ఆషికీ 2’లోని ‘సున్ రహా హై నా తూ’ పాటను శ్రేయాతో కలిసి ఆలపించి అభిమానులను అలరించారు. 13 ఏళ్ల తర్వాత ‘ఆరోహీ’ జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న ఈ ఇద్దరి కలయిక వీడియోలు వైరల్ అవుతున్నాయి.

By:  Srikanth Kontham   |   24 Nov 2026 11:13 AM IST
శ్రేయా ఘోషల్‌తో క‌పూర్ బ్యూటీ మ్యూజికల్ జర్నీ!
X

సినిమాలో పాత్రకు ప్రాణం పోసిన గాయని.. అదే నటి కోసం పదమూడేళ్ల తర్వాత మరోసారి వేదికపై పాట పాడితే ఆ క్షణం ఎంత భావోద్వేగంగా ఉంటుందో శ్రద్ధా కపూర్ అనుభవంలో కనిపించింది. బెంగళూరులో జరిగిన శ్రేయా ఘోషల్ అన్‌స్టాపబుల్ ఇండియా టూర్ లైవ్ కాన్సర్ట్‌లో శ్రద్ధా కపూర్ అనూహ్యంగా స్టేజ్‌పైకి వచ్చి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. తెల్లటి చీరలో హుందాగా మెరిసిన శ్రద్ధా తదుపరి చిత్రం `ఈథా`లోని `జీ జీ రే జీ` పాటను శ్రేయా ఆలపిస్తుండగా వేదికపై డ్యాన్స్ చేస్తూ అభిమానులను ఉర్రూతలూగించింది.

అలాగే శ్రద్ధా కెరీర్‌ను మలుపుతిప్పిన `ఆషికీ 2` చిత్రంలోని సూపర్ హిట్ గీతం `సున్ రహా హై నా తూ`ను తనతో కలిసి పాడాలని శ్రేయా ఘోషల్ ప్రోత్సహించారు. తొలుత‌ సంకోచించినా? స్టేడియంలో అభిమానుల కేరింతల నడుమ శ్రద్ధ గొంతు కలపడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పాట పూర్వ‌వ్వ‌గానే ఆడియన్స్ ఆరోహీ అంటూ నినాదాలు చేయగా.. శ్రేయా-శ్రద్ధా ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.

ఈ మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ శ్రద్ధా సోషల్ మీడియాలో ఓ హృద్యమైన పోస్ట్ పెట్టింది. పదమూడేళ్ల క్రితం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన `ఆరోహీ` పాత్రకు గొంతునిచ్చిన శ్రేయా ఘోషల్ ఇప్పుడు `ఈథా`లో `జీ జీ రే జీ` పాటను కూడా పాడటం తనకు ఓ మాయాజాలంలా అనిపిస్తోందని శ్రద్ధా పేర్కొంది. తనని వేదికపైకి ఆహ్వానించినందుకు శ్రేయాకు కృతజ్ఞతలు తెలిపింది.

దీనికి శ్రేయా ఘోషల్ కూడా అంతే ఆప్యాయంగా స్పందించింది. `ఆషికీ 2` నుంచి `ఈథా` వరకు సాగిన తమ ప్రయాణం బెంగళూరు వేదికపై కళ్లముందు నిలిచిందని.. శ్రద్ధా రాకతో ఆ రాత్రికి ఎంతో అందం వచ్చిందని రాసుకొచ్చారు. ఇద్దరి కలయికకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఇద్దరూ కలిసి డ్యూయల్ కాన్సర్ట్ చేయాలంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు బెంగళూరు షోతో తన ఇండియా టూర్‌ను ప్రారంభించిన శ్రేయా ఘోషల్ డిసెంబర్ 19న గువహటిలో, ఆ తర్వాత విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై, ముంబై సహా పలు నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చి 2027 ఏప్రిల్ 3న ఇండోర్‌లో టూర్‌ను ముగించనున్నారు.

`ఈథా` చిత్రం విష‌యానికి వ‌స్తే ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వ‌హిస్తున్నారు. లావణి కళాకారిణి విఠాబాయి భౌ మాంగ్ నారాయణ్‌గావ్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఇందులో దివంగత నటుడు నానా పటేకర్ కీల‌క పాత్ర పోషించ‌డం విశేషం. న‌ట‌డిగా నానా ప‌టేక‌ర్ చివ‌రి చిత్రం ఇదే కావ‌డం విశేషం.