క్రేజీ బీచ్ లో తెలుగమ్మాయి.. బికినీలో హీట్ పెంచేలా..
తాజాగా ఆమె సెషెల్స్ వెకేషన్ కు సంబంధించిన బీచ్ ఫొటోలను పంచుకోగా, అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
By: M Prashanth | 14 July 2026 7:15 PM ISTటాలీవుడ్ సినీ ప్రియులకు జోష్, స్నేహగీతం సినిమాలతో పరిచయమైన శ్రేయా ధన్వంతరి.. ఇప్పుడు బాలీవుడ్, ఓటీటీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంటోంది. నటిగా ఎంత బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులతో టచ్ లో ఉంటూ ఉంటుంది. తాజాగా ఆమె సెషెల్స్ వెకేషన్ కు సంబంధించిన బీచ్ ఫొటోలను పంచుకోగా, అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సముద్ర తీరంలో గ్రీన్ కలర్ స్విమ్ వేర్ లో కనిపించిన శ్రేయా స్టైలిష్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సెషెల్స్ లోని అందమైన బీచ్ లో అలలతో ఆడుకుంటూ, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ దిగిన ఫొటోలను శ్రేయా తన ఇన్ స్టాలో షేర్ చేశారు. సముద్రం, తెల్లటి ఇసుక, ప్రశాంతమైన వాతావరణం మధ్య ఆమె దిగిన పిక్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఫొటోల్లో గ్లామర్‌తో పాటు ట్రావెల్ వైబ్ కూడా స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆమె ఫిట్ నెస్ ను ప్రశంసిస్తుండగా, మరికొందరు సెషెల్స్ అందాలను ఆస్వాదించేలా ఫొటోలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.
అయితే శ్రేయా ధన్వంతరి కెరీర్ ను పరిశీలిస్తే, తెలుగు చిత్రాలతో ప్రారంభమైన ఆమె ప్రయాణం తర్వాత బాలీవుడ్ వైపు వెళ్లింది. 2009లో జోష్, 2010లో స్నేహగీతం చిత్రాల్లో నటించిన ఆమె, ఆ తర్వాత హిందీ చిత్రాలు, వెబ్ సిరీస్ లపై ఎక్కువ దృష్టి పెట్టారు. ముఖ్యంగా ది ఫ్యామిలీ మ్యాన్ లో జయా శర్మ పాత్ర, స్కామ్ 1992లో జర్నలిస్ట్ సుచేతా దలాల్ పాత్రలతో గుర్తింపు సంపాదించింది. ఆ రెండు ప్రాజెక్టులే ఆమె కెరీర్ కు కీలక మలుపుగా నిలిచాయి.
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన శ్రేయా, వరంగల్ లోని ఎన్‌ఐటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. అనంతరం మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి, 2008 ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్ గా నిలారు. అక్కడి నుంచి సినీ రంగంలో అవకాశాలు అందుకుని, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు సోషల్ మీడియాలో కూడా శ్రేయా ఫుల్ యాక్టివ్.
ట్రావెల్ డైరీస్, ఫిట్ నెస్, ఫ్యాషన్ కు సంబంధించిన పోస్టులను తరచూ పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రతి వెకేషన్‌లో కొత్త లొకేషన్లను ఎంచుకుని అక్కడి ప్రకృతి అందాలను తన ఫొటోల ద్వారా పరిచయం చేయడం ఆమెకు అలవాటే. ఇప్పుడు సెషెల్స్ నుంచి పంచుకున్న లేటెస్ట్ పిక్స్ కూడా అదే తరహాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం శ్రేయా ధన్వంతరి పలు ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ సిరీస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకవైపు నటిగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే, మరోవైపు సోషల్ మీడియాలో తన గ్లామర్, స్టైల్ తో అభిమానులను అలరిస్తున్న శ్రేయా ధన్వంతరి.. మరోసారి తన వెకేషన్ ఫొటోలతో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
