సముద్ర తీరాన శ్రియా ధన్వంతరి.. హీటేక్కిస్తున్న ఫోటోలు
తెలుగు అమ్మాయి శ్రియా ధన్వంతరి సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
By: M Prashanth | 18 March 2026 11:21 PM ISTతెలుగు అమ్మాయి శ్రియా ధన్వంతరి సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. డిఫరెంట్ లుక్స్ తో కనిపించే ఈ బ్యూటీ, ఈసారి మాత్రం బోల్డ్ మేకోవర్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె పంచుకున్న ఈ బీచ్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట మంటలు పుట్టిస్తున్నాయి.
సముద్ర తీరాన పింక్ కలర్ స్విమ్‌సూట్‌లో శ్రియా షేర్ చేసుకున్న ఫోజులు చాలా గ్లామరస్ గా ఉన్నాయి. నీటిలో ఆడుకుంటూ, వెలుతురు నీడల మధ్య తీసిన ఈ ఫొటోల్లో ఆమె అందం మరింత ఎలివేట్ అయ్యింది. ముఖ్యంగా ఆమె కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ నేచురల్ ఎక్స్‌ప్రెషన్స్ ఫొటోలకు మరింత ఇంటెన్సిటీని యాడ్ చేశాయి. ఈ ఫొటోలకు ఫ్యాన్స తో పాటు పలువురు సినీ తారలు "ఫైర్" ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన శ్రియా ధన్వంతరి, తెలుగులో నాగ చైతన్య ‘జోష్’ సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది.
ఆ తర్వాత బాలీవుడ్‌కు షిఫ్ట్ అయిన ఈమె, అక్కడ పలు వెబ్ సిరీస్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘స్కామ్ 1992’ సీరీస్ ఆమెకు స్టార్‌డమ్ తీసుకువచ్చింది. ప్రస్తుతం హిట్ సీరీస్ లతో పాటు హిందీ సినిమాల్లోనూ బిజీగా ఉంది. శ్రియా కేవలం నటి మాత్రమే కాదు, మోడలింగ్ రంగంలోనూ మంచి అనుభవం ఉన్న బ్యూటీ. ఆమె బాడీ లాంగ్వేజ్‌లో ఉండే ఈజ్ ఈ ఫొటోల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
వెస్ట్రన్ వేర్ లో ఆమె చూపిస్తున్న ఈ గ్లామర్ డోస్ చూస్తుంటే, తదుపరి సినిమాల్లో గ్లామర్ రోల్స్ కు తను సిద్ధమే అని హింట్ ఇస్తున్నట్లు అనిపిస్తోంది. ఏదేమైనా శ్రియా ధన్వంతరి చేసిన ఈ గ్లామర్ అటాక్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీసింది. క్యూటి గా పక్కింటి అమ్మాయిలా కనిపించే అమ్మాయి ఒక్కసారిగా ఇలాంటి బోల్డ్ లుక్‌లోకి మారడం ఆమె ఫ్యాన్స్‌కు కొత్తగా అనిపిస్తోంది.
