Begin typing your search above and press return to search.

రెడ్ అవుట్ ఫిట్ లో శ్రద్ధా అందాలు..

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలు ఎక్కువగా దీనిని వేదికగా చేసుకొని తమ అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

By:  Madhu Reddy   |   31 Oct 2025 10:12 AM IST
రెడ్ అవుట్ ఫిట్ లో శ్రద్ధా అందాలు..
X

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలు ఎక్కువగా దీనిని వేదికగా చేసుకొని తమ అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఒకవైపు సాంప్రదాయంగా.. మరొకవైపు గ్లామర్ వలకబోస్తూ అలాగే తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్లను కూడా వదులుతూ అభిమానులకు మరింత దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు అప్పుడప్పుడు లైవ్ చిట్ చాట్ పేరిట అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ చిట్ చాట్ లో భాగంగా ఎన్నో విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.



ఇదిలా ఉండగా ఇప్పుడు గ్లామర్ వలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరోయిన్స్ లో శ్రద్ధ శ్రీనాథ్ కూడా చేరిపోయారు. తాజాగా రెడ్ కలర్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చిన ఈమె తన అందాలతో మరొకసారి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. భిన్న విభిన్నమైన ఫోజులు ఇస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఇటు ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేసింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే తాజాగా శ్రద్ధ శ్రీనాథ్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అమ్మడి అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.




1990 సెప్టెంబర్ 29న జన్మించిన ఈ ముద్దుగుమ్మ ..తమిళ్, కన్నడ, తెలుగు చిత్రాలలో ఎక్కువగా నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది . తన నటనతో రెండు ఫిలింఫేర్ అవార్డులతో పాటు సైమా అవార్డులను కూడా దక్కించుకుంది.. తొలినాళ్ళ జీవితం విషయానికి వస్తే.. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉదంపూర్ పట్టణంలో కన్నడ మాట్లాడే కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి భారత సైన్యంలోని కమావున్ రెజిమెంటులో అధికారిగా పనిచేస్తున్నారు. తల్లి పాఠశాల ఉపాధ్యాయురాలు. సికింద్రాబాద్లోని ఆర్మీ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసిన ఈమె ఆ తర్వాత బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగల్ స్టడీస్ లో న్యాయ శాస్త్రం అభ్యసించడానికి బెంగళూరుకి కూడా వెళ్ళింది.




లా పట్టా అందుకున్న తర్వాత బెంగళూరుకు చెందిన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో రియల్ ఎస్టేట్ న్యాయవాదిగా కూడా పనిచేసింది. ఒక ఫ్రెంచ్ రిటైల్ కంపెనీలో రియల్ ఎస్టేట్ లీగల్ అడ్వైజర్ గా చేరిన ఈమె.. ఉద్యోగంలో ఉండగానే నాటకాలలో నటించి పలు యాడ్స్ లో కూడా కనిపించింది. ఆ తర్వాత సినిమాలలో అవకాశం రావడంతో వినయ్ గోవిందు దర్శకత్వం వహించిన కోహినూర్ అనే మలయాళ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఇది 2017 సెప్టెంబర్ లో విడుదల అయింది.




2019లో తొలిసారి జెర్సీ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత అదే ఏడాది జోడి, కృష్ణుడు మరియు అతని లీల అనే చిత్రాలలో కూడా నటించింది. ఇక మెకానిక్ రాకీ , సైంధవ్, డాకు మహారాజ్ వంటి చిత్రాలలో నటించిన ఈమె ఎక్కువగా తమిళ్, కన్నడ, మలయాళం చిత్రాలలోనే నటించింది. ఇ తెలుగులో చివరిగా కలియుగం 2064 సినిమాలో కనిపించింది. అలాగే ఒక టెలివిజన్ సిరీస్ లో కూడా నటించింది.