Begin typing your search above and press return to search.

ఆరు నెల‌ల్లో మ‌రో సంచ‌న‌లం గెట్ రెడీ!

అలా పుట్టిందే ప్రాంచైజీ ట్రెండ్..ఒక‌టి రెండు సినిమాలైతే సీక్వెల్స్ తో ముగింపు ప‌డుతుంది. అదే చిత్రం నుంచి మ‌రిన్ని చిత్రాలు రిలీజ్ అయితే దాన్ని ప్రాంచైజీగా భావించ‌డం పరిపాటే.

By:  Srikanth Kontham   |   29 Sept 2025 10:24 AM IST
ఆరు నెల‌ల్లో మ‌రో సంచ‌న‌లం గెట్ రెడీ!
X

బాలీవుడ్ లో చాలా సినిమాల‌కు సీక్వెల్స్ తెర‌కెక్కుతున్నాయి. రీసెంట్ స‌క్సెస్ ల సీక్వెల్స్ తో పాటు..20, 30 ఏళ్ల‌ క్రి తం నాటి సినిమాల‌కు కూడా సీక్వెల్స్..రీమేక్స్ రూపంలో కొన్ని చిత్రాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. ఇలా సీక్వె ల్స్..రీమేక్స్ తెర‌కెక్క‌డం అన్న‌ది బాలీవుడ్ లో కొత్తేం కాదు. చాలా కాలంగా ఈ ప‌ద్ద‌తి అమ‌లులో ఉంది. అలా పుట్టిందే ప్రాంచైజీ ట్రెండ్..ఒక‌టి రెండు సినిమాలైతే సీక్వెల్స్ తో ముగింపు ప‌డుతుంది. అదే చిత్రం నుంచి మ‌రిన్ని చిత్రాలు రిలీజ్ అయితే దాన్ని ప్రాంచైజీగా భావించ‌డం పరిపాటే.

ఇలా ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా? ఓ ప్రాంచైజీ మాత్రం నెట్టింట ఎప్ప‌టికీ ప్ర‌త్యేక‌మే. అది లేడీ ఓరియేంట్ చిత్రం కావ‌డంతోనే ఇంత‌టి బ‌జ్ నెల‌కొంటుంది. ఆ చిత్రం ఏంటి? అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అదే శ్ర‌ద్దా క‌పూర్ న‌టించిన `స్త్రీ `. ఇటీవ‌లే రిలీజ్ అయిన `స్త్రీ 2` బాక్సాఫీస్ ని వ‌సూళ్ల‌తో షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. మోస్తారు అంచ‌నాల‌తో రిలీజ్ అయిన సినిమా ఏకంగా 800 కోట్ల వ‌సూళ్ల‌తో లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో స‌రికొత్త రికార్డు సృష్టించింది. ఇంత పెద్ద స‌క్స‌స్ సాధిస్తుంద‌ని టీమ్ కూడా ఊహించ‌లేక‌పోయింది.

మ‌డూక్ ఫిల్మ్స్ లోనే ఓ ప్ర‌త్యేక‌మైన చిత్రంగా నిలిచింది. ఈ నేప‌థ్యంలో `స్త్రీ 3` కూడా ఉంటుంద‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే అదెప్పుడు అన్న‌ది మేక‌ర్స్ ఇంత వ‌ర‌కూ క్లారిటీ ఇవ్వ‌లేదు. కానీ శ్ర‌ద్దా క‌పూర్ మాత్రం సంతోషాన్ని ప‌ట్ట‌లేక ఓపెన్ అయిపోయింది. మ‌రో ఆరు నెలల్లో స్త్రీ 3 తో అల్ల‌రిచేస్తామంటూ హింట్ ఇచ్చేసింది. ప్రస్తుతం స్త్రీ సినిమాలోని శ్ర‌ద్దా క‌పూర్ పాత్ర ఆధారంగా ఓ యానిమేష‌న్ సినిమా నిర్మిస్తోంది మ‌డూక్ బ్యాన‌ర్.

ఈ సినిమా ప్ర‌చారంలో భాగంగా `స్త్రీ-3` కంటే ఆరు నెల‌లు ముందుగానే త‌మ యానిమేష‌న్ సినిమా రావ‌డం విశేషంగా పేర్కొంది. ఇప్ప‌టికే స్త్రీ మూడ‌వ భాగానికి సంబంధించి స్ట్రిప్ట్ సిద్ద‌మైంది. త్వ‌ర‌లోనే ప్రారంభోత్వం ఉంటుంది. అమ‌ర్ కౌశీక్ ద‌ర్శ‌కుడిగా కొన‌సాగుతున్నాడు. షూటింగ్ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసుకుని వ‌చ్చే ఏడాది మిడ్ లోనే ఈ సినిమా రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో శ్ర‌ద్దా క‌పూర్ ఆరు నెల‌లు గ‌డువుగా ప్ర‌స్తావించింది.