Begin typing your search above and press return to search.

కోట్లు కొల్ల‌గొడుతోంది! సోష‌ల్ మీడియా ఆర్జ‌న‌లో నంబ‌ర్-1 హీరోయిన్

ఇటీవ‌ల 'స్త్రీ 2' సాధించిన భారీ బాక్సాఫీస్ విజయం తర్వాత శ్రద్ధా కపూర్ తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచారు.

By:  Sivaji Kontham   |   21 July 2026 12:56 AM IST
కోట్లు కొల్ల‌గొడుతోంది! సోష‌ల్ మీడియా ఆర్జ‌న‌లో నంబ‌ర్-1 హీరోయిన్
X

కేవ‌లం బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ అంత‌టా ఫాలోయింగ్ సంపాదించుకున్న గొప్ప క‌థానాయిక శ్ర‌ద్ధా క‌పూర్. అందానికి అందం, ప్ర‌తిభ‌తో దీనిని సాధించింది. గ్లామ‌ర్ రంగంలో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బాలీవుడ్ భామ ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో సైతం తిరుగులేని రాణిగా దూసుకుపోతున్నారు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న భారతీయ నటీమణుల్లో అగ్రస్థానంలో నిలిచారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 9.3 కోట్ల (93 మిలియన్ల)కు పైగా అనుచరులతో భారతదేశంలోనే అత్యధిక ఫాలోయింగ్ ఉన్న ప్రముఖులలో ఒకరిగా రికార్డు సృష్టించిన శ్రద్ధా... డిజిటల్ ప్రమోషన్ల ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జిస్తూ సోషల్ మీడియాలలో నంబర్ వన్ సంపాదకురాలిగా మారారు.

శ్రద్ధా కపూర్ కు ఉన్న భారీ ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకుని బ్రాండ్లు ఈ బ్యూటీతో ఒప్పందాలు చేసుకోవడానికి క్యూ కడుతున్నాయి. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో శ్ర‌ద్ధా చేసే ఒక్కో ప్రమోషనల్ పోస్ట్‌కు మైండ్ బ్లాకింగ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక్క బ్రాండెడ్ పోస్ట్ లేదా రీల్ ద్వారా ప్రచారం చేయడానికి సుమారు 1 కోటి నుండి 1.5 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ప్రముఖ కంపెనీలు కూడా ఈ స్థాయి మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధపడుతున్నాయి.

కేవలం ఇన్‌స్టాగ్రామ్‌కే పరిమితం కాకుండా... ఇతర సోషల్ మీడియా వేదికలపైనా శ్ర‌ద్ధా దూకుడుగా ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ - ఎక్స్ (ట్విట్టర్) రెండింటినీ కలిపి ఒకేసారి క్యాంపెయిన్ ప్రమోషన్ చేయాలంటే శ్రద్ధా కపూర్ భారీ ప్యాకేజీని డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లలో క్రాస్ ప్రమోషన్ చేయడానికి సుమారు 1.5 కోట్ల నుండి 2 కోట్ల రూపాయల వరకు ఛార్జ్ చేస్తుండటం విశేషం.

ప్రస్తుతం శ్రద్ధా కపూర్ పలు దిగ్గజ జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన బిస్క్ ఫామ్-రిచ్ మేరీ ప్రచారంతో పాటు పాల్మోనాస్, లాక్మే, వీట్ వంటి అగ్రగామి బ్రాండ్లతో ప్ర‌చార‌క‌ర్త‌గా శ్ర‌ద్ధా భాగస్వామ్యం కొన‌సాగుతోంది. తరచుగా ఈ బ్రాండ్లకు సంబంధించిన వినూత్న వీడియోలు- పోస్టులను డిజిటల్ వేదికలపై షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు బ్రాండ్ విలువను సైతం విపరీతంగా పెంచుతున్నారు.

సోషల్ మీడియా ద్వారా శ్రద్ధా కపూర్ సంపాదిస్తున్న నెలవారీ, వార్షిక ఆదాయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ స్పాన్సర్డ్ పోస్టులు, బ్రాండ్ రీల్స్ ద్వారా నెలకు సుమారు 2.5 కోట్ల నుండి 3 కోట్ల రూపాయల వరకు ఆర్జిస్తున్నారు. ఈ లెక్కన కేవలం సోషల్ మీడియా- డిజిటల్ బ్రాండ్ ప్రమోషన్ల ద్వారానే ఏడాదికి 25 కోట్ల నుండి 30 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని అందుకుంటూ, సినిమాలకు సమాంతరంగా భారీ డిజిటల్ సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు.

ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటోంది?

ఇటీవ‌ల 'స్త్రీ 2' సాధించిన భారీ బాక్సాఫీస్ విజయం తర్వాత శ్రద్ధా కపూర్ తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచారు.

ప్రస్తుతం ఒక్కో సినిమాకు 12 కోట్ల నుండి 17 కోట్లు (లాభాల్లో వాటాతో కలిపి) వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. శ్ర‌ద్ధా న‌టించిన ఈత రాక కోసం అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాసేలా వేచి చూస్తున్నారు. ఈ చిత్రంలో ఒక మేటి డ్యాన్స్ క‌ళాకారిణిగా శ్ర‌ద్దా న‌టిస్తున్నారు.