ఎరుపు చీరలో శ్రద్ధా కపూర్ కిల్లర్ లుక్స్
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి తన కొత్త లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.
By: M Prashanth | 27 Sept 2025 12:57 AM ISTబాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి తన కొత్త లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. లేటెస్ట్ గా ఎరుపు రంగు చీరలో ఆమె షేర్ చేసిన ఫోటోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. సింపుల్ జువెలరీ, లైట్ మేకప్, క్లాసీ హేర్ స్టైల్‌తో ఆమె గ్లామర్ గర్ల్ గా మెరిసింది. ఎరుపు రంగు చీరలో ఆమె కిల్లర్ లుక్స్ ప్రత్యేకంగా ఆకట్టుకోవడం ఫోటోలకు మరింత లైఫ్ ఇచ్చింది.
శ్రద్ధా కెరీర్ విషయానికి వస్తే, రొమాంటిక్ సినిమాల నుంచి యాక్షన్ ఎంటర్టైనర్స్ వరకు విభిన్న పాత్రల్లో ఆమె తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆషికీ 2తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఆమె, ఆ తర్వాత ఏబీసీడి 2, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, సాహో వంటి చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా ప్రాభాస్ సరసన వచ్చిన సాహోలో ఆమె పాత్ర తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది.
ఆమధ్య వచ్చిన తూ ఝూటీ మైన్ మక్కార్లో కూడా శ్రద్ధా ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో బాగానే ఆకట్టుకుంది. రన్‌బీర్ కపూర్‌తో చేసిన ఆ సినిమా మ్యూజికల్ ఎంటర్టైనర్‌గా మంచి హిట్టయింది. ఇక హారర్ మూవీ స్త్రీ2తో మరో బిగ్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో కొన్ని లేడి ఓరియెంటెడ్ ప్రాజెక్టులు ఉన్నాయని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ క్రమంలో ఆమె కొత్త లుక్స్, ఫొటోషూట్లు ఫ్యాన్స్‌ను బాగా కనెక్ట్ చేస్తున్నాయి.
సోషల్ మీడియాలో శ్రద్ధా షేర్ చేసిన ఈ ఎరుపు చీర ఫొటోలు అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంటున్నాయి. క్వీన్ ఆఫ్ బ్యూటీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రెండు గంటల్లోనే లక్షల లైక్స్ రావడం చూస్తే ఆమె క్రేజ్ ఎంత ఉందో అర్థమవుతుంది. ప్రతి ఫొటోలోనూ గ్లామర్ ను మిక్స్ చేస్తూ ముందుకు సాగుతున్న ఆమె, రాబోయే ప్రాజెక్ట్స్‌తో మరోసారి ప్రేక్షకులను తన వైపు తిప్పుకునే అవకాశం ఉంది.
