Begin typing your search above and press return to search.

సుకుమార్ మ‌న‌సులో క‌పూర్ వార‌సురాలా?

మ‌రికొన్ని రోజుల్లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ `పెద్ది` నుంచి రిలీజ్ అయిపోతాడు. ఇప్ప‌టికే దాదాపు షూటింగ్ పూర్త‌యింది.

By:  Srikanth Kontham   |   4 March 2026 9:00 PM IST
సుకుమార్ మ‌న‌సులో క‌పూర్ వార‌సురాలా?
X

మ‌రికొన్ని రోజుల్లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ `పెద్ది` నుంచి రిలీజ్ అయిపోతాడు. ఇప్ప‌టికే దాదాపు షూటింగ్ పూర్త‌యింది. క్లైమాక్స్ షూట్ జ‌రుగుతోంది. ఇంకా కొన్ని రోజుల్లో చ‌ర‌ణ్ రిలీవ్ అవుతాడు. అటుపై రిలీజ్ ప‌నుల్లో ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు బిజీ అవుతాడు. ఇప్ప‌టికే చ‌ర‌ణ్ డ‌బ్బింగ్ ప‌నులు కూడా మొద‌లు పెట్టాడు. చ‌కా చ‌కా ఆ ప‌నులు పూర్తి చేస్తున్నాడు. ఇటు ద‌ర్శ‌కుడు సుకుమార్ చ‌ర‌ణ్ తో తెర‌కెక్కించాల్సిన సినిమా ప‌నుల్లోనూ బిజీ అయ్యాడు. సుకుమార్ టీమ్ ఆ ప‌నుల్లో బిజీగా ఉంది. అయితే ఇందులో హీరోయిన్ ఎంపిక ఇంకా పూర్తి కాలేదు.

చ‌ర‌ణ్ కి జోడీగా ఏ నాయిక‌ను తీసుకుంటున్నారనే డిస్క‌ష‌న్ ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో మొద‌లైపోయింది. ర‌ష్మికా మంద‌న్నా, స‌మంత‌, కృతి స‌న‌న్ వీళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ వీరంతా సుకుమార్ గ‌త చిత్రాల్లో ప‌ని చేసిన వారే. `రంగ‌స్థ‌లం`లో స‌మంత‌-చ‌ర‌ణ్ కాంబినేషన్ చూసారు. సుకుమార్ తెర‌కెక్కించిన `వ‌న్` సినిమాలో కృతి స‌న‌న్ హీరోయిన్ గా న‌టించింది. అదే సుకుమార్ తెర‌కెక్కించిన `పుష్ప` సినిమా లో ర‌ష్మికా మంద‌న్నా న‌టించింది. మ‌ళ్లీ సుకుమార్ వీళ్ల‌లో ఒక‌రిని హీరోయిన్ గా తీసుకునే అవ‌కాశాలు ఎంత మాత్రం లేవు.

సుకుమార్ హీరోయిన్ల‌ను రిపీట చేయ‌డు. కొత్త భామ‌ల వైపే చూస్తాడు. ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్ కోసం క‌పూర్ వార‌సుల్ని అనుకుంటున్నట్లు వెలుగులోకి వ‌చ్చింది. చ‌ర‌ణ్ కి జోడీగా శ్ర‌ద్దా క‌పూర్ ను తీసుకుంటే? ఎలా ఉంటుంది? అనే ఆలోచ‌న‌ను త‌న క్రియేటివ్ టీమ్ తో డిస్క‌స్ చేస్తున్నాడుట‌. అందుకు టీమ్ లో కొంత మంది స‌భ్యులు పాజిటివ్ గా స్పందించ‌గా, మ‌రికొంత మంది ఆమె కంటే ఉత్త‌మ‌మైన న‌టిని సూచించిన‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. శ్ర‌ద్దాక‌పూర్ ప్ర‌భాస్ తో న‌టించిన `సాహో `చిత్రాన్ని గుర్తు చేసి తెలుగు తెర‌పై ప్రెష్ ఫీలింగ్ రాదేమో అన్న సందేహం వ్య‌క్తం చేసారుట‌.

ఆమె కంటే చ‌ర‌ణ్-సుకుమార్ లు త‌మ‌తో ప‌నిచేయ‌ని ఓ కొత్త నటిని తీసుకుంటే బాగుంటుంద‌ని భావిస్తున్నారుట‌. సుకుమార్ రాసిన పాత్ర‌కు అనుభ‌వంతో ప‌ని లేకుండా ఏ న‌టి అయినా సూటువుతందిట‌. మ‌రి అంతి మంగా హీరోయిన్ విష‌య‌లో సుకుమార్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడు అన్న‌ది చూడాలి. హీరోయిన్ విష‌యంలో రామ్ చ‌ర‌ణ్ కూడా క‌ల్పించుకోడు. ద‌ర్శ‌కుడికే పూర్తి స్వేచ్ఛ‌నిచ్చి పాత్ర‌కు సూట్ అయ్యే వారిని తీసుకోమంటాడు. అలా అంటే? సుకుమార్ ఇంకా క‌న్ప్యూజ్ అవుతాడు. ఎందుకంటే ఈయ‌న క‌న్ప్యూజన్ మాస్ట‌ర్ అని అంద‌రికీ తెలుసు. సుకుమార్ త‌న‌కన్నా చిన్న‌వారైనా, త‌న అసిస్టెంట్ అయినా స‌రే వాళ్ల మాట‌కు అంతే గౌర‌వం ఇస్తాడు. క్రియేటివ్ గా ఎవ‌రు షేర్ చేసుకున్నా? వారిని ప్రోత్స‌హించ‌డం సుకుమార్ ప్ర‌త్యేక‌త‌.