టాలెంటెడ్ పార్ట్‌నర్‌పై ప్రశంసల జల్లు!
ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి సోషల్ మీడియాలో చాలా కాలంగా చర్చ జరుగుతోన్న నేపథ్యంలో తాజా పోస్ట్ దానికి మరింత బలాన్ని చేకూర్చింది.
By: Srikanth Kontham | 28 April 2026 9:15 AM ISTబాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడి కెరీర్ ఉత్తరాదిన దేదీప్య మానంగా సాగిపోతుంది. ఓవైపు కమర్శియల్ చిత్రాల్లో నటిస్తూనే సోలోగానూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. కథల విషయంలోనూ అంతే సెలక్టివ్ గా ఉంటుంది. బలమైన పాత్రలైతేనే కమిట్ అవుతుంది. అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు పంచుకోవడంలోనూ నిర్మొహమాటంగా వ్యవహరిస్తుంది. తాజాగా అమ్మడు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చేసిన ఓ పోస్ట్ తో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ప్రియుడు రాహుల్ మోడీ తెరకెక్కించిన ఓ వీడియోను షేర్ చేస్తూ అతడి ప్రతిభను ఆకాశానికెత్తేసింది.
ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి సోషల్ మీడియాలో చాలా కాలంగా చర్చ జరుగుతోన్న నేపథ్యంలో తాజా పోస్ట్ దానికి మరింత బలాన్ని చేకూర్చింది. రాహుల్ మోడీ దర్శకత్వం వహించిన ప్రకటనలో నటి అనీత్ పద్దా నటించారు. ఈ వీడియోను చూసిన శ్రద్ధా కపూర్, రాహుల్ సృజనాత్మకతకు ఫిదా అయింది. `టాలెంటెడ్` అనే క్యాప్షన్‌తో పాటు హార్ట్ ఎమోజీని జోడించి ఆనందాన్ని పంచుకున్నారు. యాడ్ లో నటించిన అనీత్ పద్దా పనితీరును కూడా ప్రత్యేకంగా మెచ్చుకుంది. శ్రద్ధా ఇలా బహిరంగంగా తన పార్ట్‌నర్‌కు మద్దతు పలకడంతో ఇద్దరి మద్య ప్రేమ పరుగులు పెడుతుందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
గతంలో ఇద్దరు జంటగా వెకేషన్లకు వెళ్లిన ఫోటోలు, అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో కలిసి కనిపించిన దృశ్యాలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే శ్రద్ధా ఈ రిలేషన్ షిప్ గురించి ఎక్కడా స్పందించింది లేదు.
కానీ సమయం వచ్చిన ప్రతీ సదర్బంలోనూ ఇలాంటి చిన్న చిన్న సంకేతాల ద్వారా అభిమానులకు హిట్ ఇస్తూనే ఉంది. రాహుల్ పనిని గౌరవించడం తో వారి మధ్య ఉన్న బలమైన బంధానికి ఇదో నిదర్శనంగా నిలుస్తుంది.
రాహుల్ మోడీ చిత్ర పరిశ్రమలో రచయితగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
శ్రద్ధా కపూర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన `తూ ఝూతీ మే మక్కార్` చిత్రానికి కథా రచయితగా పనిచేశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ప్రేమగా మారిందంటారు. అప్పటి నుంచి వృత్తిపరంగా ఒకరికొకరు సహకరించుకుంటూనే వ్యక్తిగత జీవితంలో కూడా ఒకరి విజయాలను మరొకరు సెలబ్రేట్ చేసుకోవడం హైలైట్ గా మారింది. శ్రద్దా కపూర్ సినిమాల విషయానికి వస్తే చివరిగా `స్త్రీ 2` తో భారీ విజయం అందుకుంది. రెండేళ్ల క్రితం రిలీజ్అయిన చిత్రమిది. అప్పటి నుంచి మరో సినిమాకు కమిట్ అవ్వలేదు.
