క్లాసిక్ డాన్సర్ గా సాహో బ్యూటీ!
స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూ సోలోగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడం ఆషామాషీ కాదు.
By: Srikanth Kontham | 14 Sept 2025 8:00 PM ISTస్టార్ హీరోలకు జోడీగా నటిస్తూ సోలోగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడం ఆషామాషీ కాదు. హీరోయిన్ గా వచ్చిన గుర్తింపును ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో కొనసాగించడం అన్నది సక్సెస్ మీదనే ఆధారపడి ఉంటుంది. సోలో నాయికగా నటించే క్రమంలో ఎక్కడ తేడాలు జరిగినా? హీరోయిన్ అవకాశాలకే ఎసరొ స్తుంది. వైఫల్యం అన్నది ఎలాంటి పరిస్థితులకైనా దారి తీస్తుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందు కెళ్లడం అన్నది అందరికీ సాధ్యం కాదు. ఈ విషయంలో శ్రద్దా కపూర్ మాత్రం పర్పెక్ట్ గా ప్లాప్ చేసుకుని ముందుకెళ్తోంది.
ఓ వైపు కమర్శియల్ సక్సెస్ లు అందుకుంటూ మరోవైపు లేడీ ఓరియేంటెడ్ చిత్రాలతోనూ బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఆమె కే చెల్లింది. `స్త్రీ 2` తో 800 కోట్ల క్లబ్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తదు పరి చిత్రాలు కూడా అంతే ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసుకుంటోంది. జానపద ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన మహారాష్ట్ర నృత్యకళాకారిణి, గాయని వితాబాయి బావుమంగ్ నారాయణ్ జీవితంలో నటి స్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని `ఛావా` దర్శకుడు లక్ష్మణ్ ఉట్టేకర్ టేకప్ చేయడంతో మరింత ప్రతి ష్టాత్మకంగా మారింది.
తాజాగా ఈ పాత్ర కోసం శ్రద్దా కపూర్ శిక్షణ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. క్లాసికల్ డాన్సర్ పాత్ర కోసం అందుకు అవసరమైన శిక్షణ తీసుకుంటుందని తెలిసింది. ఓ ప్రముఖ క్లాసికల్ డాన్సర్ ఆధ్వ ర్యంలో లక్ష్మణ్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సంస్కృతిని జాతీయ స్థాయికి తీసు కెళ్లడానికి చిత్ర బృందం ప్రయత్నిస్తుంది. `ఛావా`తో గొప్ప దేశ భక్తిని చాటిన దర్శకుడిగా లక్ష్మణ్ పేరు ట్రెండింగ్ లో నిలిచిన సంగతి తెలిసిందే.
ఆ వెంటనే ఇలాంటి కథాంశంతో ముందుకు రావడంతో మరోసారి లక్ష్మణ్ పేరు నెట్టింట హాట్ టాపిక్ అవు తున్నాడు. ప్రస్తుతం శ్రద్దా కపూర్ ప్రాజెక్ట్ కు సంబంధించి వర్క్ షాప్ లకు హాజరవుతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులన్నింటిని పూర్తి చేసి నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చే స్తున్నారు. అయితే ఈ సినిమా నిర్మాణ సంస్థ పేరు ఇంకా తెరపైకి రాలేదు. ఈ నెలాకరుకల్లా అన్ని వివరాలు అధికారికంగా బయటకు వస్తాయని సమాచారం.
