గందరగోళంలోకి నెట్టేసిన శ్రద్ధా
`సాహో` చిత్రంతో తెలుగు వారికి సుపరిచితమైన నటి శ్రద్ధా కపూర్. తనదైన అందం, నట ప్రతిభతో యువహృదయాలను గెలుచుకున్న ఈ బ్యూటీని ఆరాధించని బోయ్స్ లేరంటే అతిశయోక్తి కాదు.
By: Sivaji Kontham | 3 Jan 2026 8:30 AM IST`సాహో` చిత్రంతో తెలుగు వారికి సుపరిచితమైన నటి శ్రద్ధా కపూర్. తనదైన అందం, నట ప్రతిభతో యువహృదయాలను గెలుచుకున్న ఈ బ్యూటీని ఆరాధించని బోయ్స్ లేరంటే అతిశయోక్తి కాదు. శ్రద్ధా ఇటీవల స్త్రీ2 లోను అద్భుత నటనతో ఆకట్టుకుంది. హారర్ సినిమాలో శ్రద్దా నటనకు మంచి మార్కులే పడ్డాయి. తదుపరి క్రిష్ 4లోను శ్రద్ధా కపూర్ నటించనుంది.
ఇక శ్రద్ధా నిరంతర ఇన్ స్టా పోస్టులు ఇంటర్నెట్ లో హాట్ టాపిగ్గా మారుతున్నాయి. ఈ భామ తాజాగా పింక్ ఫ్రాక్ ధరించిన ఓ అందమైన ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసి, దాంతో పాటే ఒక కొటేషన్ కూడా ఇచ్చింది. ``గులాబ్ అంటే గులాబీ, గులాబీలు ఎరుపు, ఎరుపు అంటే లాల్, కానీ గులాబీ అంటే పింక్? సరైన గందరగోళం`` అని ఒక కవితను రాసింది. అయితే ఈ కవిత్వం పాఠకుల్ని తీవ్ర గందరగోళంలోకి నెట్టింది. శ్రద్ధాను సోషల్ మీడియాల్లో అనుసరిస్తున్న లక్షలాది మంది కన్ఫ్యూజన్ లోకి వెళ్లిపోయారు. ఈ రంగు-పద విరుద్ధతను హైలైట్ చేసిన విధానం ఆకర్షణీయంగా ఉన్నా, శ్రద్ధా లోతైన పరిభాషను అర్థం చేసుకోవడం కుర్రాళ్ల వల్ల కాలేదు.
`గులాబ్` అనే పువ్వుకు మూలం రోజ్. చాలా గులాబీలు ఎరుపు రంగులో ఉంటాయి... అని కూడా ఇందులో వివరంగా ఉంది. అయితే శ్రద్ధా విసిరిన పజిల్‌ను పూరించడానికి ప్రయత్నించిన అభిమానులు ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. శ్రద్ధా 9.3 కోట్ల మంది ఫాలోవర్లతో భారతీయ చిత్రపరిశ్రమలో క్రేజీ హీరోయిన్ గా వెలిగిపోతోంది. ఈ పోస్ట్ చేసిన మొదటి 60 నిమిషాల్లోనే 10,000 కంటే ఎక్కువ కామెంట్లు వినిపించాయి.
ఈ పోస్ట్ కి సోషల్ మీడియాల్లో ఫ్యాన్స్ ఛమత్కారంగా స్పందించారు. శ్రద్ధ మాత్రమే భాషా సంక్షోభాన్ని ఇంత సౌందర్యంగా కనిపించేలా చేయగలదు! అని ఒకరు రాసారు. చాలామంది ఆమె `స్ట్రీ` వ్యక్తిత్వాన్ని ప్రస్తావించారు. గులాబీ-గులాబీ తర్కం కంటే ఓ `స్ట్రీ` రహస్యాన్ని కనుగొనడం సులభం అని కొందరు సరదాగా వ్యాఖ్యానించారు. మొత్తానికి శ్రద్ధా ఫజిల్ తాలూకా గందరగోళం నుంచి బయటపడటం ఎవరి వల్లా కాలేదు!
