Begin typing your search above and press return to search.

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

శ్రద్ధా కపూర్ దీపావళి సందర్భంగా ‘ఈత’ సినిమా నుంచి విడుదల చేసిన కొత్త లుక్ ఆకట్టుకుంటోంది. సంప్రదాయ పట్టుచీర, భారీ ఆభరణాలు, కిరీటంతో లక్ష్మీదేవిని తలపించేలా కనిపిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ తమాషా, లావణి కళాకారిణి వీఠాభాయి భౌ మాంగ్ నారాయణ్‌గర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌లో శ్రద్ధా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 2026లో విడుదల కానుంది.

By:  Sivaji Kontham   |   6 Nov 2026 10:00 PM IST
శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు
X

చూడ‌గానే న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు.. ధేధీప్య‌మాన‌మైన ఆ రూపం చూడ‌గానే ప్ర‌జ‌లు త‌రించిపోతున్నారు. దీపావ‌ళి రాక ముందే ల‌క్ష్మీ దేవి న‌ట్టింట అడుగుపెట్టింద‌నే సంబ‌రం క‌ళ్ల‌లో క‌నిపిస్తుంది. శ్ర‌ద్ధా ఈ కొత్త లుక్ నిజంగా స్ట‌న్నింగ్. సాక్షాత్తూ దేవ‌తే దిగి వ‌చ్చింది! అన్న‌ట్టుగా ఈ స్ఫుర‌ద్రూపం భ‌క్తిపార‌వ‌శ్యంలోకి దించేస్తోంది. ముఖ్యంగా శ్ర‌ద్ధా ధ‌రించిన ఆ ప‌ట్టుచీర‌, భారీ ఆభ‌ర‌ణాలు, కిరీటం.. ఇవ‌న్నీ దేవ‌తామూర్తికి ప్ర‌తిరూపంగా నిల‌బెట్టాయి.





ద‌క్షిణాదిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి చెందిన క‌ళాకారిణి గ‌రివిడి ల‌క్ష్మి ఎంత‌గా పాపుల‌ర‌య్యారో.. ఉత్త‌రాదిన మ‌రాఠాకు చెందిన త‌మాషా క‌ళాకారిణి వీఠాభాయి అంతే గొప్ప పాపుల‌ర్. ఇప్పుడు త‌మాషా లావ‌ణి క‌ళాకారిణి వీఠాభాయి పాత్ర‌లో న‌టిస్తున్నారు శ్ర‌ద్ధాదాస్. సాహో లాంటి రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల కంటే భిన్నంగా త‌న‌లోని న‌టిని బ‌య‌ట‌కు తెచ్చే ఇలాంటి పాత్ర‌ను ఎంపిక చేయ‌డం ద్వారా శ్ర‌ద్దా మ‌రోసారి త‌న‌లోని విల‌క్ష‌ణ‌త‌ను చాటుకుంటోంది. శ్ర‌ద్ధా త‌న గ‌త‌ పాత్రలు అన్నిటికంటే భిన్న‌మైన తెలివైన‌ ఎంపిక ఇది.





ఇప్పుడు దీపావళి పండగ ను పుర‌స్క‌రించుకుని శ్రద్ధా కపూర్ షేర్ చేసిన‌ ఒకే ఒక్క ఫోటోగ్రాఫ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ధంతేరస్ శుభాకాంక్షలు తెలుపుతూ ``యే దివాలీ, ఈత వాలీ`` అంటూ రిలీజ్ చేసిన‌ కొత్త లుక్ చూసి అభిమానులు, ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతున్నారు. దీపం వెలిగించగానే సాక్షాత్తూ లక్ష్మీ దేవి ప్రత్యక్షమైనట్టుగా ఉన్న ఆ రూపం చూసి అంతా భక్తిపారవశ్యంలో మునిగిపోతున్నారు. దీపావళికి ముందే నట్టింట శ్రీలక్ష్మి అడుగుపెట్టిందనే సంబరం నెటిజన్ల కామెంట్లలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ కొత్త లుక్‌లో శ్రద్ధా కపూర్ అవతారం నిజంగా స్టన్నింగ్. శ్రద్ధా ధరించిన సంప్రదాయ పట్టుచీర, భారీ ఆభరణాలు, శిరస్సుపై శోభిల్లుతున్న కిరీటం.. ఇవన్నీ త‌న‌ను ఒక దివ్యమైన దేవతామూర్తికి ప్రతిరూపంగా నిలబెట్టాయి. ``సాక్షాత్తూ దేవియే దిగివచ్చింది``, ``రియల్ గాడెస్`` అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది. కాస్ట్యూమ్ డిజైనింగ్, ఆహార్యం ప్రతి ఒక్కటి ఆ లుక్‌కు మహోన్నతమైన దివ్యత్వాన్ని అపాదించాయి.

ఈ పిక్ కేవలం పండగ పబ్లిసిటీ మాత్రమే కాదు.. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో మ‌డాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న భారీ బయోపిక్ `ఈత` మూవీలోని స్పెషల్ లుక్. దక్షిణాన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ప్రముఖ జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి ఎంతగా పాపులర్ అయ్యారో.. ఉత్తరాదిన మహారాష్ట్రకు చెందిన ప్రసిద్ధ తమాషా, లావణి కళాకారిణి వీఠాభాయి భౌ మాంగ్ నారాయణ్‌గాంకర్ అంతే ఘనమైన ప్రాచుర్యం పొందారు. ఇప్పుడు ఆ మహోన్నత కళాకారిణి వీఠాభాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోనే శ్రద్ధా కపూర్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు.

ఇటీవల `స్త్రీ 2`తో బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల మేర వసూళ్ల సునామీ సృష్టించి అపారమైన ప్రజాదరణ పొందిన శ్రద్ధా కపూర్.. ఆ తర్వాత రెగ్యులర్ కమర్షియల్, గ్లామర్ పాత్రల వైపు వెళ్లకుండా ఇలాంటి పవర్ ఫుల్ బయోపిక్‌ను ఎంచుకోవడం ఆమె తెలివైన ఎంపికకు నిదర్శనం. `సాహో` వంటి భారీ యాక్షన్ చిత్రాలు చేసినా నటిగా తనలోని విలక్షణతను, విభిన్న కోణాలను బయటకు తీసేందుకు `ఈత` లాంటి చిత్రం పర్ఫెక్ట్ వేదికగా నిలవనుంది. జీవిత పోరాటాలు, నృత్యం, భావోద్వేగాలతో కూడిన వీఠాభాయి పాత్ర శ్రద్ధా కెరీర్‌లోనే మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ డిసెంబర్ 2026లో ప్రేక్షకుల ముందుకు రానున్న `ఈత` చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నెటిజన్లు ``ఈసారి దీపావళికి స్వీట్లు కాదు.. ఈత మ్యాజిక్ చూడాల్సిందే`` అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఒకవైపు స్త్రీ 3, భేడియా 2, నాగిన్ వంటి భారీ ఫ్రాంచైజీ చిత్రాలు లైన్‌లో ఉన్నా కానీ.. వీఠాభాయి బయోపిక్ ద్వారా శ్రద్ధా కపూర్ నటప్ర‌ద‌ర్శ‌న.. ఈ లక్ష్మీ దేవి లాంటి దివ్యమైన లుక్ సినిమాపై అంచనాలను రెట్టింపు పెంచాయి.