ChatGPT తో టైమ్ పాస్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్
సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఏఐ వాడకం, మరీ ముఖ్యంగా ChatGPT వాడకం మన రెగ్యులర్ లైఫ్ లో భాగమైపోయాయి.
By: Sravani Lakshmi Srungarapu | 5 Oct 2025 12:11 PM ISTసోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఏఐ వాడకం, మరీ ముఖ్యంగా ChatGPT వాడకం మన రెగ్యులర్ లైఫ్ లో భాగమైపోయాయి. ఏ చిన్న అనుమానమున్నా వెంటనే ChatGPT ను అడుగుతూ తమ అనుమానాలను తొలగించుకుంటున్నారు. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కూడా ఈ ChatGPTని ఎక్కువగా వాడతారని రీసెంట్ గా ఆమె ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ చూస్తుంటే తెలుస్తోంది.
అయితే శ్రద్ధా ChatGPT ని అడిగిన విషయమేంటో తెలిస్తే ఆశ్చర్యపోకమానరు. శ్రద్ధా కపూర్ ఓ కేక్ ముక్క ఫోటోను పోస్ట్ చేస్తూ, తాను ఇప్పుడు తినవలసిన ఎక్కువ కొవ్వు ఉన్న డిజర్ట్ ఏంటో చెప్పమని అడుగుతూ, ఆ స్టోరీకి ఆమిర్ ఖాన్, జూహీ చావ్లా నటించిన ఖయామత్ సే ఖయామత్ తక్ మూవీలోని గజబ్ కా హై దిన్ పాటను కూడా యాడ్ చేశారు శ్రద్ధా.
గణపతి నిమజ్జనం సమయంలో 6 మోదక్‌లు తిన్న శ్రద్ధా
అయితే శ్రద్ధా కపూర్ మంచి భోజన ప్రియురాలు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫీడ్ చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. అంతేకాదు, ఈ ఇయర్ సెప్టెంబర్ లో గణపతి నిమజ్జనం టైమ్ లో ఆమె తన ముందు ఉన్న 6 మోదక్‌లను కూడా తినేశారు. వినాయక నిమజ్జనం రోజు 6వ తేదీ కాబట్టి, తాను 6 మోదక్‌లను తింటానని చెప్తూ ఇన్‌స్టాలో స్టోరీని షేర్ చేశారు శ్రద్ధా.
గతంలో జిలేబీలు తింటూ..
గతంలో కూడా శ్రద్ధా షూటింగ్ టైమ్ లో జిలేబీలు తింటూ కనిపించారు. శ్రద్ధా సెట్స్ నుంచి ఓ ఫోటోను పోస్ట్ చేయగా, ఆ పోస్ట్ లో శ్రద్ధా జిలేబీ బాక్స్ తో కలిపి ఫోటోలకు పోజులిస్తూ షూటింగ్ అనేది కేవలం సాకు మాత్రమేనని, అసలు కారణం జిలేబీ తినడమేనని రాసుకొచ్చారు. ఇక కెరీర్ విషయానికొస్తే శ్రద్ధా కపూర్ ఛావా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ తో కలిసి ఓ పీరియాడికల్ డ్రామా చేస్తున్నారు. దినేష్ విజన్ నిర్మించనున్న ఈ సినిమా నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. ఇది కాకుండా ఏక్తా కపూర్ తో ఓ మల్టీ ఫిల్మ్ డీల్ కు కూడా సైన్ చేశారు శ్రద్ధా కపూర్.
