Begin typing your search above and press return to search.

బ్రాండ్స్- సినిమాలతో శ్ర‌ద్ధా క‌పూర్ వార్షికాదాయం రేంజ్ ఎంతో తెలుసా?

ఇటీవల శ్రద్ధా కపూర్ ఇన్‌స్టా ఫీడ్ పరిశీలిస్తే. ఈ బ్యూటీ క్రేజ్ ఎలాంటిదో స్పష్టమ‌వుతోంది.

By:  Sivaji Kontham   |   23 Jun 2026 6:48 AM IST
బ్రాండ్స్- సినిమాలతో శ్ర‌ద్ధా క‌పూర్ వార్షికాదాయం రేంజ్ ఎంతో తెలుసా?
X

స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కేవలం నార్త్ లోనే కాకుండా సౌత్ ఇండియాలోనూ భారీగా ఫాలోవర్లను సంపాదించుకున్న మేటి న‌టి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన పాన్ ఇండియా మూవీ `సాహో` చిత్రంలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. ఆషిఖీ 2, ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన `స్త్రీ 2` వంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దక్షిణాదిన కూడా ఈ భామకు తిరుగులేని ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన భారతీయ నటీమణులలో ఒకరిగా నిలుస్తూ సోషల్ మీడియా క్వీన్‌గా దూసుకుపోతోంది.

ఇటీవల శ్రద్ధా కపూర్ ఇన్‌స్టా ఫీడ్ పరిశీలిస్తే. ఈ బ్యూటీ క్రేజ్ ఎలాంటిదో స్పష్టమ‌వుతోంది. నిరంతరం అభిమానులతో టచ్‌లో ఉండే ఈ ముద్దుగుమ్మ పలు అంతర్జాతీయ, దేశీయ కార్పొరేట్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ప్రమోషన్స్ చేస్తోంది. ఫ్యాషన్ దిగ్గజం ఆజియో, హెల్త్ అండ్ వెల్నెస్ బ్రాండ్ `ప్లిక్స్`, లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్ `పాల్మోనాస్` వంటి మరెన్నో ప్రముఖ బ్రాండ్స్ కోసం శ్ర‌ద్ధా ఏడాదికి కాంట్రాక్టులు కుదుర్చుకుంది. బ్రాండ్ అంబాసిడర్‌గా ఒక్కో మెగా కాంట్రాక్ట్ కోసం శ్రద్ధా కపూర్ ఏడాదికి సుమారు రూ. 4 నుండి రూ. 6 కోట్ల వరకు భారీ పారితోషికం అందుకుంటున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం.

కేవలం పూర్తి స్థాయి బ్రాండ్ కాంట్రాక్టులు మాత్రమే కాకుండా.. తన ఇన్‌స్టా ఖాతా ద్వారా చేసే ఒక్కో పెయిడ్ ప్రమోషనల్ పోస్ట్ లేదా రీల్ కోసం కూడా శ్రద్ధా కపూర్ భారీగా వసూలు చేస్తుంది. సోషల్ మీడియాలో త‌న‌కు ఉన్న విపరీతమైన ఎంగేజ్‌మెంట్ రేట్ కారణంగా.. ఇన్‌స్టా పోస్టులను చూస్తే.. డజనుకు పైగా బ్రాండ్లను ప్రమోట్ చేస్తోంది. వాటన్నిటి వార్షిక కాంట్రాక్టులు.. సోషల్ మీడియా ప్రమోషన్ల విలువ కలుపుకుంటే...కేవలం ప్రకటనల రూపంలోనే ఆమెకు ప్రతి సంవత్సరం సుమారు రూ. 25 నుండి రూ. 35 కోట్ల వరకు భారీ ఆదాయం సమకూరుతోందని అంచనా.

ఇక సినిమాల విషయానికి వస్తే.. శ్రద్ధా కపూర్ చాలా సెలెక్టివ్‌గా స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ ఏడాదికి ఒకటి లేదా రెండు చిత్రాలలో మాత్రమే నటిస్తుంది. `స్త్రీ 2` గ్రాండ్ సక్సెస్ తర్వాత శ్ర‌ద్ధా తన రెమ్యూనరేషన్‌ను మరింత పెంచేసింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు దాదాపు రూ. 12 నుండి రూ. 15 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీ టాక్. కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఓకే చెబుతున్న శ్రద్ధాకు సినిమాల రెమ్యూనరేషన్ రూపంలో ఏడాదికి సగటున రూ. 15 నుండి రూ. 25 కోట్ల వరకు ఆదాయం ముడుతోంది.

ఈ విధంగా ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం, సినిమాల పారితోషికం కాకుండా ర‌క‌ర‌కాల‌ వ్యాపార‌ పెట్టుబడులను విశ్లేషిస్తే.. శ్రద్ధా కపూర్ ఒక సంవత్సరానికి మొత్తం కలిపి సుమారు రూ. 50 నుండి రూ. 70 కోట్ల వరకు ఆర్జిస్తోందని ఒక అంచ‌నా. నటనలోనే కాకుండా వ్యాపార రంగంలోనూ రాణిస్తూ, బ్రాండ్స్ విలువను పెంచడంలో దూసుకెళుతున్న శ్ర‌ద్ధా ఆర్జ‌న నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే అత్యంత ధనవంతురాలైన‌.. సక్సెస్‌ఫుల్ హీరోయిన్ల జాబితాలో శ్ర‌ద్దా పేరు ఇప్పుడు సుస్థిరంగా ఉంది.