Begin typing your search above and press return to search.

గోవా ట్రిప్ లో బన్నీ బ్యూటీ.. ఎంజాయ్మెంట్ మామూలుగా లేదుగా!

ఈమధ్య నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలు షేర్ చేస్తున్న శ్రద్ధాదాస్.. తాజాగా గోవా ట్రిప్ కి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

By:  Madhu Reddy   |   9 Dec 2025 1:00 AM IST
గోవా ట్రిప్ లో బన్నీ బ్యూటీ.. ఎంజాయ్మెంట్ మామూలుగా లేదుగా!
X

సెలబ్రిటీలు కాస్త సమయం దొరికితే చాలు వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఫ్యామిలీతో వెళ్తే.. మరి కొంతమంది సింగిల్ గా వెళ్లి తమ మూడ్ మార్చుకుంటూ ఉంటారు అనడంలో సందేహం లేదు. సినిమాల ద్వారా నిత్యం బిజీగా ఉంటూ స్ట్రెస్ కి గురైన ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు వెకేషన్ కి వెళ్లి కాస్త చిల్ అవుతూ.. మైండ్ ను రీ ఫ్రెష్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బన్నీ బ్యూటీ కూడా గోవా ట్రిప్ కి వెళ్ళింది. అక్కడ ఆమె చేసిన అల్లరి చూస్తే మాత్రం మామూలుగా లేదు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఆమె ఎవరో కాదు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో వచ్చిన ఆర్య 2 సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన శ్రద్ధా దాస్. తన అందంతోనే కాదు నటనతో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే ఊహించని పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈమధ్య నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలు షేర్ చేస్తున్న శ్రద్ధాదాస్.. తాజాగా గోవా ట్రిప్ కి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఇందులో ఆమె పెట్ డాగ్స్ తో చిల్ అవుతున్న ఫోటోలతో పాటు అటు చర్చికి సంబంధించిన ఫోటోలు అలాగే గోవా రెస్టారెంట్ లో ఆమె టేస్ట్ చేసిన డిసర్ట్ లకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకుంది. ప్రస్తుతం శ్రద్ధా దాస్ కి సంబంధించిన ఈ గోవా ట్రిప్ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.

శ్రద్ధా దాస్ కెరియర్ విషయానికి వస్తే.. ఆర్య 2, అధినేత, టార్గెట్ వంటి చిత్రాలలో నటించి తన కెరీర్ ను ఆరంభించిన శ్రద్ధా దాస్.. ఆ తర్వాత మొగుడు, ముగ్గురు, మరోచరిత్ర, నాగవల్లి, డిక్టేటర్, నిరీక్షణ , అర్థం, డార్లింగ్, సిద్దు ఫ్రం శ్రీకాకుళం, గుంటూరు టాకీస్ ఇలా పలు చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగులోనే కాదు హిందీ, కన్నడ వంటి చిత్రాలలో కూడా నటించిన ఈమె తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సినిమాలే కాదు వెబ్ సిరీస్లలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఖాకీ: ది బీహార్ చాప్టర్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది.

ఈమె బాల్యం, కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే.. ముంబైలో జన్మించింది. ఈమె తండ్రి వ్యాపారవేత్త కాగా.. తల్లి గృహిణి. పురూలియా నుండి ముంబై వచ్చి అక్కడే సెటిల్ అయ్యారు. ముంబైలోనే తన విద్యాభాసాన్ని పూర్తి చేసిన ఈమె.. ముంబై విశ్వవిద్యాలయం నుండి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా అందుకుంది..