Begin typing your search above and press return to search.

కూలిపోయే విమానంలో చిక్కుకున్న న‌టీమ‌ణులు

అయితే టాలీవుడ్ న‌టి శ్ర‌ద్ధా దాస్ కి ఓసారి విమానంలో ఒణుకు పుట్టించే అనుభ‌వం ఎదురైంది. అది ముంబై నుంచి హైద‌రాబాద్ కి ప్ర‌యాణ‌మైన విమానం.

By:  Sivaji Kontham   |   9 Nov 2025 11:48 AM IST
కూలిపోయే విమానంలో చిక్కుకున్న న‌టీమ‌ణులు
X

ఇటీవ‌లి కాలంలో విమాన ప్ర‌యాణాలు భ‌యాన‌కంగా మారాయి. ఎప్పుడు ఏ విమానం కూలిపోతోందో అనే ఆందోళ‌న ప్ర‌యాణీకుల్లో పెరిగింది. దీనికి కార‌ణం గ‌డిచిన కొన్ని నెల‌ల్లో వ‌రుస ప్ర‌మాదాల గురించి వినాల్సి రావ‌డ‌మే. గాల్లో విహంగం నేల‌కు స‌జావుగా చేరుతుందా లేదా? అనే సందేహాలను రేకెత్తించింది. ఇంత‌కుముందు వైద్య విద్యార్థుల హాస్ట‌ల్ పై కుప్ప‌కూలిన పెను విమాన ప్ర‌మాదం 250 మంది మ‌ర‌ణానికి కార‌ణ‌మైంది. ఈ ఘోర విమాన ప్ర‌మాదం త‌ర్వాత చాలా విమానాలు గాల్లో టేకాప్ అయ్యాక‌, తిరిగి గ్రౌండ్ కి చేరుకోవ‌డంతో అది మ‌రింతగా ప్ర‌జ‌ల్ని ఆందోళ‌న‌కు గురి చేసింది.

అయితే టాలీవుడ్ న‌టి శ్ర‌ద్ధా దాస్ కి ఓసారి విమానంలో ఒణుకు పుట్టించే అనుభ‌వం ఎదురైంది. అది ముంబై నుంచి హైద‌రాబాద్ కి ప్ర‌యాణ‌మైన విమానం. `విస్తారా` బ్రాండ్ విమానం సాంకేతిక స‌మ‌స్య‌ల కార‌ణంగా గాల్లో ఊగిస‌లాడింద‌ని, ఆల్మోస్ట్ మ‌ర‌ణానికి చేరువ‌గా వెళుతున్నామ‌ని తాను ఆందోళ‌న చెందిన‌ట్టు చెప్పింది శ్ర‌ద్దా దాస్. చాలా గంద‌ర‌గోళం, సందేహాలు .. ప్ర‌యాణీకుల్లో ఒక్క‌సారిగా అల‌జ‌డి, కానీ త‌న ప‌క్క‌నే కూచుని ఉన్న ర‌ష్మిక మంద‌న్న మాత్రం చాలా ప్ర‌శాంతంగా ఉన్నార‌ని గుర్తు చేసుకుంది శ్ర‌ద్ధా దాస్. త‌న ప్ర‌శాంత‌త‌, స్వీటెస్ట్ నేచుర్ ని పొగిడేసింది దాస్. 2024లో ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని శ్రద్ధాదాస్ గుర్తు చేసుకుంది.

బ‌హుశా ర‌ష్మిక మంద‌న్న `పుష్ప` చిత్రంలో నటిస్తున్న సమ‌యంలోనే ఇలాంటి ఒక అనుభ‌వాన్ని ఎదుర్కొందా? అంటూ అభిమానులు ఇప్పుడు ప్ర‌శ్నిస్తున్నారు. విమానం గాల్లో ఉండ‌గా సాంకేతిక స‌మ‌స్య తలెత్తినా ఎంతో నైపుణ్యంతో తిరిగి దానిని ముంబై విమానాశ్ర‌యంలో సేఫ్ ల్యాండింగ్ చేసిన పైలెట్ కి శ్ర‌ద్ధా నిజంగానే ధన్య‌వాదాలు తెలియ‌జేయాల్సి ఉంది.

``ఆ క్ష‌ణం మరణానికి దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. ..మా విమానం దాదాపుగా కూలిపోయే దశలో ఉంది..`` అని శ్ర‌ద్ధాదాస్ చెప్ప‌డాన్ని బ‌ట్టి క‌చ్ఛితంగా అది టెరిబుల్ ఘ‌ట‌న అనే విష‌యం మ‌రువ‌రాదు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే, శ్ర‌ద్ధాదాస్ ఆర్య 2 స‌హా పలు విజ‌య‌వంత‌మైన తెలుగు చిత్రాల్లో న‌టించింది. కానీ కెరీర్ ప‌రంగా ఆశించిన స్థాయికి ఎద‌గ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం వెబ్ సిరీస్ ల‌లోను అవ‌కాశాలు అందుకుంటోంది. `సెర్చ్: ది నైనా మర్డర్ కేస్‌`లో శ్ర‌ద్ధా న‌టించింది. ర‌ష్మిక మంద‌న్న కొన్ని వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసింది.