ఆలయాలు దర్గాలు చర్చిలు.. అక్కినేని కోడలు ఆధ్యాత్మిక యాత్ర!
తెలుగు, హిందీ చిత్రాల్లో బిజీ హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగానే శోభిత ధూళిపాల, నాగచైతన్యను పెళ్లాడి అక్కినేని ఇంటి కోడలు అయిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 8 Aug 2025 10:15 AM ISTతెలుగు, హిందీ చిత్రాల్లో బిజీ హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగానే శోభిత ధూళిపాల, నాగచైతన్యను పెళ్లాడి అక్కినేని ఇంటి కోడలు అయిన సంగతి తెలిసిందే. తమిళమ్మాయి సమంత నుంచి విడిపోయిన నాగచైతన్య తెలుగమ్మాయి శోభితను ప్రేమించి పెళ్లాడాడు. ఈ జంట పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వెబ్ లో అందుబాటులో ఉన్నాయి.
సైలెన్స్ దేనికోసమో...
శోభిత పెళ్లి తర్వాత స్థబ్ధుగా ఉంది. పెళ్లి తర్వాత పూర్తిగా భర్తతో కాపురం, ప్లెజెంట్ లైఫ్ ని ఆస్వాధిస్తోంది. ఇంతలోనే ఇప్పుడు తమిళనాడులోని పలు ఆలయాలు, దర్గాలు, చర్చి వంటి ఆధ్యాత్మిక స్థలాలను సందర్శించడం ఆసక్తిని కలిగిస్తోంది. తెలుగింటి సాంప్రదాయాలను మేళవించిన ట్రెడిషనల్ దుస్తుల్లో తమిళనాడు ఆలయాల ఆధ్యాత్మిక యాత్రలో కనిపించిన శోభిత అందరి దృష్టిని ఆకర్షించింది. లైఫ్ లేట్ లీ అనే సింపుల్ క్యాప్షన్‌తో ఈ ఫోటోలను శోభిత షేర్ చేసింది.
సొగసు చూడతరమా..!
ఒక ప్రత్యేకమైన ఫోటోగ్రాఫ్ లో శోభిత సాంప్రదాయబద్ధమైన రూపం అందరి దృష్టిని ఆకర్షించింది. ముక్కుకు ముక్కెర, చెవులకు లోలాకులు, నుదిటిన పాపిడి బొట్టు, నడుముకు వడ్డానం, మెడలో భారీతనం నిండిన బంగారు హారం, చేతికి బరువైన గాజులు.. సొగసు చూడతరమా? అన్నంతగా శోభిత అలంకరణ అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ అలంకరణ దేనికోసం? అంటే .. తమిళనాడులోని ఒక ఫ్రెండు పెళ్లికి వెళ్లినప్పుడు ఇలా అందంగా చీరలో సాంప్రదాయబద్ధంగా కనిపించింది. మరోవైపు కాజువల్ దుస్తుల్లో శోభిత చర్చి, దర్గాలను సందర్శించిన ఫోటోలు కూడా ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.
నటనలోకి రీఎంట్రీ ఎప్పుడు?
గూఢచారి, మేజర్, పొన్నియన్ సెల్వన్, ది నైట్ మేనేజర్, ది మంకీ మ్యాన్ సహా పలు చిత్రాల్లో శోభిత ధూళిపాల అద్భుత నటప్రదర్శనకు ప్రశంసలు కురిసాయి. అవార్డ్ విన్నింగ్ నటప్రదర్శకురాలిగా శోభిత హృదయాలలో నిలిచి ఉంది. కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లితో సినిమాలకు కామా పెట్టింది. అయితే శోభిత తిరిగి నటనలోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
