బ్లాక్ డ్రెస్‌లో శోభిత.. మోడ్రన్ లుక్‌లో స్టన్నింగ్!
గూఢచారి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శోభిత ధూళిపాళ.
By: M Prashanth | 15 Dec 2025 11:06 PM ISTగూఢచారి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శోభిత ధూళిపాళ. కేవలం సినిమాలతోనే కాకుండా, తన యూనిక్ ఫ్యాషన్ సెన్స్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. లేటెస్ట్ గా ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ లేటెస్ట్ ఫొటోషూట్‌లో శోభిత నలుపు రంగు స్టైలిష్ డ్రెస్‌లో మెరిసిపోతున్నారు. స్లీవ్‌లెస్‌గా, హై నెక్‌తో డిజైన్ చేసిన ఈ అవుట్‌ఫిట్ ఆమె పర్ఫెక్ట్ గ్లామర్ ను ఎలివేట్ చేస్తోంది. నడుము భాగంలో వచ్చిన కట్అవుట్స్, అక్కడ మెరుస్తున్న సన్నని సిల్వర్ చైన్ డీటైలింగ్ ఈ డ్రెస్‌కు మరో హైలెట్. సింపుల్‌గా కనిపిస్తూనే ఎంతో స్టైలిష్‌గా ఉన్న ఈ లుక్ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటోంది.
"ప్రతి సీజన్‌కు మోడ్రన్ పాలిష్" అంటూ ఆమె ఇచ్చిన క్యాప్షన్ ఆమె అప్పియరెన్స్‌కు సరిగ్గా సరిపోయింది. హెవీ మేకప్ జోలికి వెళ్లకుండా, స్టన్నింగ్ లుక్‌తో చాలా క్లాసీగా కనిపిస్తున్నారు. చెవులకు పెద్ద క్రిస్టల్ ఇయర్ రింగ్స్ మినహా వేరే ఆభరణాలు ఏమీ లేకుండానే ఇంత గ్రాండ్‌గా కనిపించడం ఒక్క శోభితకే సాధ్యం అనిపిస్తోంది.
అక్కినేని నాగచైతన్యతో పెళ్లి తర్వాత శోభిత క్రేజ్ మరింత పెరిగింది. కెరీర్ పరంగానూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. 'మంకీ మ్యాన్'తో హాలీవుడ్‌లోనూ సత్తా చాటిన ఆమె, ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సాధారణంగా బ్లాక్ డ్రెస్ అంటేనే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. అందులోనూ శోభిత వంటి ఫ్యాషబ్ గర్ల్ ధరిస్తే ఆ లుక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. గోడకు ఆనుకుని ఆమె ఇచ్చిన ఫోజులు, ఆ లుక్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రాబోయే రోజుల్లో వెండితెరపై ఆమె ఇంకా ఎలాంటి గ్లామర్ తో ఆకట్టుకుంటారో చూడాలి.
