Begin typing your search above and press return to search.

విజయ్ తల్లిగా సీనియర్ బ్యూటీ.. ఏదో పెద్ద ప్లాన్ లా ఉందే!

యాక్షన్, మాస్, ఎమోషనల్ కథలను ఎంచుకుంటూ కెరీర్‌ లో కొత్త స్టేజ్ లోకి అడుగుపెడుతున్న ఆయన.. ప్రస్తుతం దర్శకుడు రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన సినిమా చేస్తున్నారు.

By:  M Prashanth   |   1 Feb 2026 7:00 PM IST
విజయ్ తల్లిగా సీనియర్ బ్యూటీ.. ఏదో పెద్ద ప్లాన్ లా ఉందే!
X

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. యాక్షన్, మాస్, ఎమోషనల్ కథలను ఎంచుకుంటూ కెరీర్‌ లో కొత్త స్టేజ్ లోకి అడుగుపెడుతున్న ఆయన.. ప్రస్తుతం దర్శకుడు రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన సినిమా చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఆ మాస్ ఎంటర్టైనర్‌ పై ఇప్పటికే ఆడియన్స్, అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది.

తాజాగా ఆ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. చిత్రంలో సీనియర్ హీరోయిన్ శోభన కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఫ్లాష్‌ బ్యాక్ సన్నివేశాల్లో విజయ్ దేవరకొండకు తల్లి పాత్రలో ఆమె నటించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన శోభన మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్నారన్న వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

అయితే ఆ వార్తపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. దీంతో ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది వేచి చూడాల్సిందే. దాదాపు 18 ఏళ్ల తర్వాత శోభన కల్కి 2898 ఏడీ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత మరోసారి రౌడీ జనార్ధనలో ముఖ్యమైన పాత్రలో నటించే అవకాశం ఉంది. దీంతో ఏదో పెద్ద ప్లాన్ లా ఉందని నెటిజన్లు చెబుతున్నారు.

ఇప్పుడు రౌడీ జనార్దనలో నటిస్తారనే ప్రచారం.. ప్రాజెక్ట్‌ పై మరింత హైప్ తీసుకొచ్చింది. ఇక చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో, కంటెంట్‌ కు ప్రాధాన్యం ఇస్తూ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. దిల్‌ రాజు బ్యానర్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో నమ్మకం కూడా ఎక్కువగానే ఉంది. కథ, కథనం పరంగా కొత్తదనంతో పాటు మాస్ ఎలిమెంట్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

మరోవైపు, సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు! ఆయన పాత్ర కథకు చాలా ముఖ్యమని, మునుపెన్నడూ చూడని లుక్‌ లో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారని టాక్. ఇప్పటికే రాజశేఖర్ లుక్ టెస్ట్ కూడా పూర్తి అయినట్లు సమాచారం. ఆయన క్యారెక్టర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని వినికిడి.

హీరోయిన్‌ గా కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. విజయ్ - కీర్తి కాంబినేషన్ మొదటిసారి కావడంతో ఆ జోడీపై కూడా మంచి ఆసక్తి నెలకొంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథతో పాటు కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ ఎపిసోడ్స్ కలగలిపి సినిమా రూపొందుతుందని సమాచారం. మొత్తంగా చూస్తే రౌడీ జనార్దనపై ఒక్కో అప్డేట్‌ తో అంచనాలు పెరుగుతున్నాయి. కథలో ట్విస్టులు, సీనియర్ నటీనటుల ఎంట్రీ, భారీ నిర్మాణ విలువలు అన్నీ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టనున్నాయి. మరి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.