Begin typing your search above and press return to search.

న‌ట భూష‌ణ్ రియ‌ల్ లైఫ్ లోనూ ఆ స‌న్నివేశం!

కుటుంబ క‌థా చిత్రాల‌కు రారాజు. మ‌హిళా ప్రేక్ష‌క‌లోకానికి మ‌హారాజు. తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో సొగ్గాడు.

By:  Srikanth Kontham   |   2 Sept 2025 3:00 PM IST
న‌ట భూష‌ణ్ రియ‌ల్ లైఫ్ లోనూ ఆ స‌న్నివేశం!
X

కుటుంబ క‌థా చిత్రాల‌కు రారాజు. మ‌హిళా ప్రేక్ష‌క‌లోకానికి మ‌హారాజు. తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో సొగ్గాడు. తొలి త‌రం అగ్ర కథానాయ‌కుల్లో ఒక‌రు న‌ట భూష‌ణ్ శోభ‌న్ బాబు. ఎన్టీఆర్, ఏఎన్నార్ రాజ్య‌మేలుతోన్న రోజుల్లోనే కుటుంబ క‌థాబ‌లం ఉన్న చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచారు. మాస్ సినిమాల‌తోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ త‌ర్వాత రాముడి పాత్ర‌లో తెలుగింట ప్రేక్ష‌కుల‌కు గుర్తిండిపోయే పేరు శోభ‌న్ బాబు. ఇలా అన్ని జాన‌ర్ల‌లో న‌టించి ఎవ్వెర్ గ్రీన్ సోగ్గాడిగా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానం సంపాదించారు.

సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వ‌చ్చి తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఓ లెజెండ్ గా ఎదిగారు. అంత‌టి లెజెండ‌రీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు దేవి ప్ర‌సాద్ పంచుకున్నారు. `అప్ప‌ట్లో శోభ‌న్ బాబు గారితో కోడి రామ‌కృష్ణ `ఆస్తి మూరెడు ఆశ బారెడు` సినిమా చేసారు. ఆ సినిమా తీసే స‌మ యంలో ఆయ‌న ద‌గ్గ‌రే ఉన్నాను. షూటింగ్ గ్యాప్ లో శోభ‌న్ బాబు రామ‌కృష్ణ గారు మాట్లాడుకుంటే వినేవాడిని. ఆ సినిమాలో హీరో-హీరోయిన్ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన పాత్ర‌లు పోషిస్తారు.

క‌ష్టాల్లో ఉంటారు. కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాల‌ని ఆలోచిస్తుంటారు. దీనిలో భాగంగా నెల ఖ‌ర్చులు వేసుకుంటారు. ఆ సీన్ గురించి డైరెక్ట‌ర్ చెప్ప‌గానే శోభ‌న్ బాబు గారు క‌న్నీళ్లు పెట్టుకున్నార‌న్నారు. వ్య‌క్తి గ‌తంగా ఆయ‌న అలా క‌నెక్ట్ అవ్వ‌డానికి ఓ బ‌ల‌మైన కార‌ణ ముంద‌న్నారు. శోభ‌న్ బాబు గారు ఎమోష‌నల్ అవ్వ‌డం చూసి ఆశ్చ‌ర్య పోయాం. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో సినిమాల్లో స‌రిగ్గా వేషాలు రాని రోజుల్ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు. శోభ‌న్ బాబు గారు జీవితంలో కూడా అలాంటి రోజులున్నాయ‌ని చెప్పు కొచ్చారు.

తాను..త‌న భ‌ర్య అలాగే నెల ఖ‌ర్చులు ప్లాన్ చేసుకునే వాళ్లం అనే మాట రామ‌కృష్ణ గారుకి చెప్ప‌డం నాకు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగింద‌న్నారు. అంత పెద్ద స్టార్ ఆయ‌న‌కు క‌ష్టాలేముంటాయ‌నుకునే వాడిని తెలియ‌క‌. ఓ సారి ఇంటి అద్దె క‌ట్ట‌లేద‌ని ఓన‌ర్ వ‌చ్చి ప్యూజ్ తీసుకెళ్లిపోయాడుట‌. దీంతో భార్యా భ‌ర్త‌లిద్ద‌రు తెల్లారే వ‌ర‌కూ కుమారుడికి గాలి విసురుతూ నిద్ర లేకుండా కూర్చున్న‌ట్లు శోభ‌న్ బాబు గారు గుర్తు చేసుకు న్నార‌న్నారు. అలా `ఆస్తి మూరెడు ఆశ బారెడు` సీన్ శోభ‌న్ బాబు నిజ జీవితంలోనూ చూసారు.