Begin typing your search above and press return to search.

సానియా మాజీ భర్త.. మూడో పెళ్లీ క్యాన్సిల్?

హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాజీ భర్త, పాకిస్థాన్ లెజెండరీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మరోసారి విడాకుల దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

By:  Garuda Media   |   5 Oct 2025 12:11 PM IST
సానియా మాజీ భర్త.. మూడో పెళ్లీ క్యాన్సిల్?
X

హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాజీ భర్త, పాకిస్థాన్ లెజెండరీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మరోసారి విడాకుల దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. సానియా నుంచి విడిపోయిన కొన్ని నెలలకే అతను సనా జావెద్ అనే పాకిస్థానీ టీవీ ప్రెజెంటర్‌‌ను పెళ్లాడాడు. ఈ జంట కొంత కాలం అన్యోన్యంగానే సాగింది. కానీ పెళ్లయి ఏడాది అయిందో లేదో వీరి మధ్య విభేదాలు తలెత్తినట్లు పాకిస్థాన్ మీడియాలోనే కాక ఇండియన్ మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. షోయబ్ మాలిక్, సనా విడాకుల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. షోయబ్ మాలిక్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వివాదాస్పదమే. అతను సానియాతో మాత్రమే ఎక్కువ కాలం వైవాహిక జీవితంలో ఉన్నాడు. ఆమె కంటే ముందు ఒక పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు సనా నుంచి కూడా విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సానియాను పెళ్లాడడానికి ముందు జరిగిన షోయబ్ వివాహం తీవ్ర వివాదాస్పదమైంది. అతను హైదరాబాద్‌కే చెందిన ఆయేషా సిద్ధిఖి అనే అమ్మాయిని వివాహమాడాడు. ఆమె నుంచి విడాకులు తీసుకుని సానియాను పెళ్లాడగా.. ఆ వివాహ సమయంలో ఆయేషా పెద్ద గొడవే చేసింది. ఆ వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేసి సానియాను పెళ్లి చేసుకున్నాడు షోయబ్. పెళ్లి తర్వాాత కూడా సానియా హైదరాబాద్‌‌లోనే ఉంది. షోయబ్ పాకిస్థాన్‌లోనే ఉండేవాడు. ఇద్దరూ దుబాయ్‌లో కలుసుకునేవాళ్లు. లేదా షోయబ్ హైదరాబాద్‌కు వచ్చేవాడు. వీరికి 2018లో ఒక కొడుకు పుట్టాడు. బిడ్డ పుట్టాక ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలోనే 2023లో ఇద్దరూ విడిపోయారు. 2024 ఆరంభంలో వీరి విడాకుల గురించి వార్తలు బయటికి వచ్చాయి. ఆ సమయానికే మాలిక్.. సనా జావెద్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. మరి వీరి విడాకుల గురించి వస్తున్న వార్తలు ఎంత వరకు నిజమవుతాయో చూడాలి.