'పెద్ది'తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు ఖాయం- కన్నడ హీరో సంచలన కామెంట్స్!
"ఈ సినిమాలో చరణ్ యాక్టింగ్ చూసి ఆడియన్స్ ముక్కున వేలేసుకుంటారు. ఆయన పడ్డ కష్టం, చూపించిన వేరియేషన్స్ మామూలుగా లేవు.
By: Madhu Reddy | 25 May 2026 10:09 PM ISTమెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ఒక పవర్‌ఫుల్ రోల్ ప్లే చేశారు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో శివన్న సినిమా గురించి, రామ్ చరణ్ యాక్టింగ్ గురించి చేసిన కొన్ని షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వివరాలు చూద్దాం..
చరణ్‌కు జాతీయ అవార్డు గ్యారెంటీ:
ప్రెస్ మీట్‌లో శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. "ఈ సినిమాలో చరణ్ యాక్టింగ్ చూసి ఆడియన్స్ ముక్కున వేలేసుకుంటారు. ఆయన పడ్డ కష్టం, చూపించిన వేరియేషన్స్ మామూలుగా లేవు. 'పెద్ది' సినిమాతో రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు రావడం ఖాయం" అంటూ శివన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
రెండేళ్ల కష్టం.. అద్భుతమైన ట్రాన్స్‌ఫార్మేషన్:
ఈ క్యారెక్టర్ కోసం రామ్ చరణ్ దాదాపు రెండేళ్ల పాటు పూర్తిగా డెడికేట్ అయ్యారని శివన్న చెప్పారు. సినిమా కోసం చరణ్ తన బాడీని మార్చుకున్న తీరు, పాత్రలో లీనమైపోయిన విధానం చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందేనని, అంత నిజాయితీగా చరణ్ ఈ పాత్రను పోషించాడని కొనియాడారు.
శివన్న క్యారెక్టర్ 'గౌర్నాయుడు':
సినిమాలో తన పాత్ర గురించి చెప్తూ.. తాను 'గౌర్నాయుడు' అనే ఒక పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నట్లు శివన్న రివీల్ చేశారు. ఇది హీరోకు కోచ్‌లాంటి పాత్ర అని, ‘పెద్ది’ కథలో ఈ క్యారెక్టర్ చాలా కీలకంగా ఉంటుందని తెలిపారు. ఇక వీరిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని నమ్మకం వ్యక్తం చేశారు.
బుచ్చిబాబు డైరెక్షన్ సూపర్:
దర్శకుడు బుచ్చిబాబు సానా గురించి చెబుతూ.. ఆయన కథను అద్భుతంగా తెరకెక్కించారని శివన్న పొగిడారు. కథకు ఏం కావాలో దాన్ని స్క్రీన్‌పై అద్భుతంగా చూపించారని, రత్నవేలు సినిమాటోగ్రఫీ విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని అన్నారు. అలాగే ఇక జగపతి బాబు పాత్ర కూడా చాలా బాగా డిజైన్ చేశారని చెప్పారు.
క్లైమాక్స్ ఎవరూ ఊహించలేరు:
'పెద్ది' సినిమాలో రకరకాల స్పోర్ట్స్ ఉంటాయని, అవన్నీ కథలో భాగంగానే వస్తాయని శివన్న తెలిపారు. అన్నిటికంటే ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుందని, దాన్ని థియేటర్లలోనే చూసి ఎక్స్‌పీరియన్స్ చేయాలని, ప్రొడ్యూసర్ సతీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారని చెప్పుకొచ్చారు.
ఒక సీనియర్ స్టార్ హీరో, అది కూడా పక్క ఇండస్ట్రీ సూపర్ స్టార్ అయిన శివన్న స్వయంగా రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు వస్తుందని చెప్పడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక శివన్న మాటలతో 'పెద్ది' సినిమాపై అంచనాలు డబుల్ అయ్యాయి. ఇక జూన్ 4న థియేటర్లలో ‘పెద్ది’ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
