Begin typing your search above and press return to search.

హీరో కూతురుకి హిట్ సీక్వెల్ కలిసి వచ్చేనా?

‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌ ‘ఈఎన్‌ఈ రిపీట్’ నవంబర్ 19, 2026న విడుదలకు సిద్ధమవుతోంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను నటిస్తున్న ఈ చిత్రంపై యువతలో మంచి అంచనాలున్నాయి. ఇందులో కీలక పాత్ర పోషించిన శివాత్మిక రాజశేఖర్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ‘దొరసాని’తో నటిగా గుర్తింపు తెచ్చుకున్నా ఆశించిన అవకాశాలు దక్కని ఆమెకు ‘ఈఎన్‌ఈ రిపీట్’ మంచి బ్రేక్ ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

By:  Ramesh Palla   |   14 Nov 2026 12:13 PM IST
హీరో కూతురుకి హిట్ సీక్వెల్ కలిసి వచ్చేనా?
X

2018లో వచ్చి కల్ట్‌ హిట్‌గా నిలిచిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమాకు సీక్వెల్‌గా 'ఈఎన్‌ఈ రిపీట్' రూపొందిన విషయం తెల్సిందే. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను నవంబర్‌ 19, 2026న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 8 ఏళ్లు అయినా ఈ నగరానికి ఏమైంది సినిమాకు మంచి క్రేజ్ ఉంది. ఆ మధ్య సినిమాను రీ రిలీజ్‌ చేస్తే మంచి స్పందన దక్కించుకుని, భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెల్సిందే. యూత్‌ ఆడియన్స్‌ లో విపరీతమైన క్రేజ్ ఉన్న ఈఎన్‌ఈ రిపీట్‌ తో దర్శకుడిగా తరుణ్‌ భాస్కర్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అనే నమ్మకంను యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా సినిమాలో నటించిన విశ్వక్‌ సేన్‌, అభినవ్‌ గోమఠం, వెంకటేష్‌ కాకుమానులు మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం అంటున్నారు. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన శివాత్మిక రాజశేఖర్‌ సైతం చాలా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఈఎన్‌ఈ రిపీట్‌ సినిమాలో శివాత్మిక...

టాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ హీరో రాజశేఖర్‌ చిన్న కూతురు శివాత్మిక రాజశేఖర్‌. ఈమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయింది. బాలీవుడ్‌లో మాదిరిగా టాలీవుడ్‌లో స్టార్‌ కిడ్స్ కి హీరోయిన్‌గా ఆశించిన స్థాయిలో ఆఫర్లు దక్కడం లేదు. ముఖ్యంగా స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు స్టార్‌ కిడ్స్ కి దక్కడం లేదు. అందుకే శివాత్మిక రాజశేఖర్‌ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దొరసాని సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శివాత్మిక మొదటి సినిమాతో మంచి మార్కులు దక్కించుకుంది. కానీ సినిమా విడుదల తర్వాత మాత్రం ఆమెకు పెద్దగా ఆఫర్లు దక్కలేదు. చిన్న సినిమాలు, చిన్న పాత్రలు చేస్తూ కెరీర్‌ ను నెట్టుకు వస్తున్న ఈ అమ్మడు తాజాగా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఆమెకు లక్‌ ను తెచ్చి పెడుతుందా అనేది చూడాలి.

తరుణ్‌ భాస్కర్‌ ఈ నగరానికి ఏమైంది సినిమా...

మొదటి సినిమా దొరసాని 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో శివాత్మకి యాక్టింగ్‌ కు మంచి మార్కులు పడ్డాయి. అయితే సినిమా కమర్షియల్‌గా భారీ విజయాన్ని సొంతం చేసుకోలేదు. అయినా కూడా నటిగా మంచి ఆఫర్లు వస్తాయని అంతా భావించారు. కానీ స్టార్‌ హీరోలు, యంగ్‌ స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకోలేదు. పెద్ద ప్రాధాన్యత లేని పాత్రల్లో, సినిమాల్లో నటించడం వల్ల శివాత్మిక ప్రతిభ పెద్దగా వెలుగులోకి రాలేదు. టాలీవుడ్‌ లో స్టార్స్‌ కి జోడీగా నటించే అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్‌లోనూ ఈమె ప్రయత్నించింది. ఒక వైపు చదువు కొనసాగిస్తూ, మరో వైపు సినిమా ఇండస్ట్రీలో రాణించేందుకు శివాత్మిక చాలా కష్టపడుతుందని ఆమె అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. తమిళ్‌ లోనూ ఈమెకు ఆశించిన స్థాయిలో హిట్స్ పడలేదు. దాంతో మళ్లీ టాలీవుడ్‌ వైపు చూస్తోంది.

రాజశేఖర్‌ ఇద్దరు కూతుర్లు...

తరుణ్‌ భాస్కర్‌ సినిమాలో ప్రతి పాత్రకు మంచి ప్రాధాన్యత దక్కుతుంది. కనుక ఈ సినిమాలో శివాత్మిక పోషించిన పాత్ర సైతం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. విశ్వక్‌ సేన్‌ ఈ సినిమాలో ఫిల్మ్‌ మేకర్‌గా కనిపించబోతున్నాడు, ఇక ట్రైలర్‌ చూస్తే శివాత్మిక సినిమాలపై పిచ్చి చూపించి, యాక్టింగ్‌ వైపు వెళ్లే అమ్మాయి పాత్రలో కనిపించబోతుంది. తనకు నిజ జీవితంలో ఉన్నయాక్టింగ్‌ ఇంట్రస్ట్‌ ను ఈ సినిమాలో శివాత్మిక చూపించబోతున్నట్లుగా ఉంది. ఈ సినిమాతో అయినా శివాత్మిక ముందు ముందు ఆఫర్లు రావాలని ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కోరుకుంటున్నారు.

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చాలా ఏళ్లకు బ్రేక్‌ దక్కించుకున్న హీరోయిన్స్ ఉన్నారు. కనుక శివాత్మిక కి ఈ సినిమాతో ఏమైనా బ్రేక్‌ దక్కేనా చూడాలి. ఇక శివాత్మిక అక్క శివానీ రాజశేఖర్‌ సైతం హీరోయిన్‌గా పరిచయం అయ్యి, ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆఫర్ల కోసం ఎదురు చూస్తుంది. ఈ ఇద్దరు స్టార్‌ కిడ్స్ కావడం వల్లే ఆఫర్లు రావడం లేదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. ఇద్దరికీ మంచి ప్రతిభ ఉన్నా అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని రాజశేఖర్‌ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.