ఆఫ్రో టపాంగ్ సాంగ్ .. ఆ వేషాలే సంథింగ్ స్పెషల్
శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి వంటి అగ్ర నటులతో అర్జున్ జన్య తెరకెక్కిస్తున్న చిత్రం `45 ది మూవీ`.
By: Sivaji Kontham | 2 Nov 2025 5:47 PM ISTశివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి వంటి అగ్ర నటులతో అర్జున్ జన్య తెరకెక్కిస్తున్న చిత్రం `45 ది మూవీ`. సూరజ్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్, గ్లింప్స్ భారీ హైప్‌ను సృష్టించాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం ఓ క్రేజీ సాంగ్‌ను విడుదల చేసారు.
`గెలుపు తలుపు దొరికే వరకు దిగులుపడుకురా..` అంటూ సాగే ఈ క్రేజీ సాంగ్‌కు రోల్ రైడా తెలుగులో సాహిత్యాన్ని అందించారు. రోల్ రైడా, వినాయక్ కలిసి ఆలపించిన ఈ పాటకు జానీ మాస్టర్ క్రేజీ స్టెప్పుల్ని కంపోజ్ చేశారు. ఈ వీడియో సాంగ్‌లోని వాతావరణం, చుట్టూ కనిపిస్తున్న ఆఫ్రికన్స్ తో జానీ మాస్టర్ వేయించిన స్టెప్పులు అదిరిపోయాయి. ఇక ఈ పాటలో శివ రాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి విభిన్న అవతారాల్లో క్రేజీగా కనిపిస్తున్నారు. ఉపేంద్ర ఎప్పటిలాగే పిలకముడి, ఒళ్లంతా పచ్చ బొట్లు రంగు రంగుల డిజైనర్ డ్రెస్ లో వెరైటీగా కనిపించగా, రాజ్ బి శెట్టి కోయ దొర వేషంలో కనిపించాడు. కొంచెం హాస్యం, కొంచెం వెరైటీ, చాలా ఎనర్జీతో పాట ఆద్యంతం ఆకట్టుకుంది. కొంత మోడ్రన్ లుక్ లో శివన్న కనిపిస్తున్నాడు. ఈ పాటకు అర్జున్ జన్య ఇచ్చిన బాణీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. ప్రస్తుతం ఈ పాట యూత్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది.
ఈ సినిమాకు డాక్టర్ కె రవి వర్మ, జాలీ బాస్టియన్, డిఫరెంట్ డానీ చేతన్ డిసౌజా స్టంట్స్ కొరియోగ్రాఫ్ చేయగా, అనిల్ కుమార్ మాటల్ని అందించారు. సత్య హెగ్డే కెమెరామెన్‌గా, కె.ఎం. ప్రకాష్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని డిసెంబర్ 25న చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
