పోటీని తట్టుకుని ఆ సినిమా నెగ్గుతుందా?
కన్నడలో సీనియర్ హీరో అయిన శివ రాజ్ కుమార్ అక్కడ స్టార్ హీరో అయినప్పటికీ తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరైంది మాత్రం రజినీకాంత్ జైలర్ మూవీ వచ్చాకే.
By: Sravani Lakshmi Srungarapu | 31 Dec 2025 7:38 PM ISTకన్నడలో సీనియర్ హీరో అయిన శివ రాజ్ కుమార్ అక్కడ స్టార్ హీరో అయినప్పటికీ తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరైంది మాత్రం రజినీకాంత్ జైలర్ మూవీ వచ్చాకే. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలో గౌర్ నాయుడు అనే కీలక పాత్ర చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆయన్ని అందరూ ప్రేమగా శివన్న అని పిలుచుకుంటారనే సంగతి తెలిసిందే.
అయితే జైలర్ కంటే ముందు కూడా ఆయన తెలుగు సినిమాలో నటించారు కానీ ఆ క్యారెక్టర్లు పెద్దగా ఆడియన్స్ కు రీచ్ అవలేదు. గౌతమీపుత్ర శాతకర్ణి మూవీలో బుర్ర కథ సాంగ్ కు డ్యాన్స్ చేసిన శివన్నకు ఆ సినిమాలో బాలయ్యతో ఎక్కువగా సీన్స్ ఉండవు. అందుకే ఆ పాత్ర ఎవరికీ పెద్దగా గుర్తులేదు. ఇదిలా ఉంటే ఆయన నటించిన 45 అనే మూవీ గత వారం కన్నడలో రిలీజైంది.
విమర్శకుల ప్రశంసల్ని అందుకున్న 45
ఈ మూవీలో శివన్నతో పాటూ ఉపేంద్ర కూడా నటించారు. అర్జున్ జన్య అనే డైరెక్టర్ ఈ మూవీతో డెబ్యూ ఇవ్వగా, క్రిటికల్ పాయింట్ తో తెరకెక్కిన 45 మూవీతో డైరెక్టర్ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. డిసెంబర్ 25న రిలీజైన ఈ సినిమాకు కన్నడలో కలెక్షన్స్ బానే ఉన్నప్పటికీ సినిమాకు సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ టాక్ అయితే రాలేదు.
న్యూ ఇయర్ సందర్భంగా తెలుగు వెర్షన్ రిలీజ్
కానీ సినిమా చూసిన వాళ్లంతా 45 మూవీ బావుందని, కొత్తగా ట్రై చేశారనే అంటున్నారు. అలాంటి విభిన్న సినిమా న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న తెలుగులో రిలీజవుతుంది. మైత్రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజవుతున్న ఈ సినిమాలో శివ రాజ్ కుమార్ అమ్మాయి వేషం వేసి అందరినీ ఆకట్టుకున్నారు. కన్నడలో ఎన్నో గొప్ప గొప్ప ప్రశంసలు అందుకున్న 45 మూవీ మరి తెలుగులో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. అయితే ఈ మూవీతో పాటూ జనవరి 1న వనవీర, సైక్ సిద్ధార్థ, సఃకుటుంబానాం లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. పోటీ ఉన్నప్పటికీ 45 మేకర్స్ సినిమాను పెద్దగా ప్రమోట్ చేయలేదు. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజవుతున్న ఈ మూవీ మరి పోటీని తట్టుకుని 45 ఏ మేర నిలబడుతుందో చూడాలి.
