రెడ్ డ్రెస్ లో యువత మనసు దోచుకుంటున్న కాత్యాయిని!
తాజాగా ఈ రెడ్ కలర్ ఫ్రాక్ శివాని నాగారం మేని ఛాయను మరింత పెంచేసింది అని చెప్పవచ్చు. ఈమెను ఇలా చూసేసరికి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
By: Madhu Reddy | 28 Oct 2025 7:01 PM IST' లిటిల్ హార్ట్స్: నో టచింగ్.. ఓన్లీ హార్ట్ టచింగ్' అనే ట్యాగ్ లైన్ తో 2025 సెప్టెంబర్ 5న థియేటర్లలో చిన్న సినిమాగా విడుదల అయింది. రొమాంటిక్ కామెడీ సినిమాగా వచ్చిన ఈ చిత్రానికి ఈటీవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆదిత్య హాసన్ నిర్మించారు. సాయి మార్తాండ్ దర్శకత్వంలో మౌళి తనూజ్, శివాని నాగారం, రాజీవ్ కనకాల, అనిత చౌదరి, ఎస్ ఎస్ కాంచీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. చిన్న సినిమాగా వచ్చి ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. అక్టోబర్ 1 నుండి ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమాలో కాత్యాయిని పాత్ర పోషించి, తన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది శివాని నాగారం. అదృష్టం తలుపు తడితే ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోవచ్చు అనడానికి ఈమె కూడా ఒక చక్కటి ఉదాహరణ అని చెప్పవచ్చు.
2024లో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఊహించిన పాపులారిటీ రాలేదనే చెప్పాలి. ఇక ఇప్పుడు లిటిల్ హార్ట్స్ సినిమాతో కాత్యాయిని పాత్ర పోషించి భారీ క్రేజ్ దక్కించుకుంది అని చెప్పవచ్చు. ఇందులో తన అద్భుతమైన నటనతో అందరి హృదయాలను దోచుకుంది. అంతేకాదు కుర్రకారు క్రష్ గా కూడా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం హే భగవాన్ అనే సినిమాలో అవకాశం అందుకుంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మరొకవైపు సోషల్ మీడియాలో తన క్రేజ్ పెంపొందించుకోవడానికి పలు రకాల ఫోటోలు షేర్ చేస్తోంది. అందులో భాగంగానే రెడ్ కలర్ డ్రెస్ ధరించిన ఈమె అందులో ఘాటు మిర్చిలా అందాలతో ఆకట్టుకుంది. తాజాగా ఈ రెడ్ కలర్ ఫ్రాక్ శివాని నాగారం మేని ఛాయను మరింత పెంచేసింది అని చెప్పవచ్చు. ఈమెను ఇలా చూసేసరికి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తమ అభిమాన బ్యూటీ రోజుకు మరింత అందంగా మారిపోతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.
శివాని నాగారం లిటిల్ హార్ట్స్ సినిమాలోని పాత్ర తనకు మంచి పేరు అందించింది అని తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ ని కూడా కాత్యాయినిగా పెట్టుకుంటానంటూ తెలిపింది ..అంతే కాదు ఇకపై స్క్రీన్ నేమ్ కూడా ఇదే అంటూ చెప్పిన ఈమె.. మరి వచ్చే సినిమాకు ఇదే పేరును కొనసాగిస్తుందా లేక శివాని పేరుగా కంటిన్యూ అవుతుందా అన్నది తెలియాల్సి ఉంది.
శివాని నాగారం 1998 ఆగస్టు 25వ తేదీన హైదరాబాద్లో జన్మించింది. ఈమె నటి మాత్రమే కాదు గాయని కూడా.. 2024 లో వచ్చిన ఆరంభం అనే సినిమాలో పాట పాడి మంచి పేరు దక్కించుకుంది . ఏది ఏమైనా చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ తెలుగమ్మాయికి అవకాశాలు వరుసగా రావాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.
