Begin typing your search above and press return to search.

నైటీ డెబ్యూ ఆ సినిమాతోనే..అసలైన హీరోయిన్ గా అప్పుడే అనిపించింది!

లాకర్ నిండా లక్షల విలువ చేసే చీరలు ఉన్నా.. భర్తను పీడించి వేల రూపాయలు ఖర్చు పెట్టించి చీరలు కొనుగోలు చేసినా రాని ఆనందం ఒక్క నైటీలో వస్తోంది అని చెబుతున్నారు మహిళలు.

By:  Madhu Reddy   |   16 Feb 2026 4:31 PM IST
నైటీ డెబ్యూ ఆ సినిమాతోనే..అసలైన హీరోయిన్ గా అప్పుడే అనిపించింది!
X

లాకర్ నిండా లక్షల విలువ చేసే చీరలు ఉన్నా.. భర్తను పీడించి వేల రూపాయలు ఖర్చు పెట్టించి చీరలు కొనుగోలు చేసినా రాని ఆనందం ఒక్క నైటీలో వస్తోంది అని చెబుతున్నారు మహిళలు. కాస్త వయసుకు వచ్చిన అమ్మాయిలను మొదలుకొని పండు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఆడవారు నైటీలను ధరించి తెగా మురిసిపోతూ ఉంటారు. ముఖ్యంగా బయటకి వస్తే చాలు అందంగా ముస్తాబయ్యే ఈ మహిళలు ఇంట్లో ఉంటే ఎప్పుడూ నైటీలతోనే కాలం గడిపేస్తూ ఉంటారు. ఇక నైటీలే మా ప్రాణం అనే మహిళలు ఉన్న ఈ రోజుల్లో అసలు నైటీ అంటే ఏంటి? అది ఎలా ఉంటుంది? దాని ధరిస్తే ఆ ఫీల్ ఏంటి ? అనే విషయాలు ఇప్పటివరకు ఫేస్ చేయలేదని.. కానీ ఆ సినిమాతోనే తన మొదటి నైటీ డెబ్యూ అయిపోయిందని చెబుతోంది యంగ్ బ్యూటీ శివాని నాగారం.

సుహాస్ హీరోగా 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. కానీ ఇటీవల 90స్ బయోపిక్ ఫేమ్ మౌళి హీరోగా, శివాని నాగారం హీరోయిన్గా వచ్చిన 'లిటిల్ హార్ట్స్' సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ఈ ఒక్క సినిమాతో కుర్ర కారు గుండెల్లో గూడు కట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మళ్లీ సుహాస్ హీరోగా 'హే భగవాన్' (హే బల్వంత్) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలో విడుదల కానున్న సందర్భంగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాని నాగారం జర్నీ గురించి చెప్పుకు రావడమే కాకుండా ముఖ్యంగా ఒక పాత్ర కోసం ఎప్పుడు చేయలేని పనులు కూడా చేయాల్సి వచ్చిందని, ముఖ్యంగా అందులో నైటీ వేసుకోవడం ఒకటని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

ఆ ఇంటర్వ్యూలో భాగంగా శివాని నాగారం మాట్లాడుతూ.. నాకు ఇప్పటివరకు నైటీ వేసుకోవడం రాదు.. కానీ మొదటిసారి లిటిల్ హార్ట్స్ సినిమాలో నైటీ వేసుకోమన్నారు. ఇక దాంతో నాకేం చేయాలో అర్థం కాక దర్శకుడితో సైజు కావాలి అని అడిగితే.. ఆయన నైటీకి ఏమి సైజులు ఉంటాయి శివానీ అని అడిగారు. ఇదే విషయాన్ని మా అమ్మకి చెబితే నైటీ వేసుకోవడం ఏంటి? అంటూ ఫస్ట్ ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత పింక్ కలర్ నైటీకి ఆమె ఫేవరెట్ పర్పుల్ కలర్ చున్నీ ఇచ్చి మరీ నన్ను షూటింగ్ కి పంపించింది. ఇక మా అమ్మ ఎంత స్వీటో అర్థం చేసుకోండి.

ఈ నైటీ అనుభవం గురించి నా ఫ్రెండ్స్ కి చెబితే వినడమే తప్ప నాకు ఆ అనుభవం లేదు.. ఇక వారు కూడా నైటీ వేసుకుంటే వచ్చే ఆ ఫీలింగ్ నీకేం తెలుసు అనేవాళ్ళు. కానీ తొలిసారి లిటిల్ హార్ట్స్ సినిమా క్లైమాక్స్ లో నేను నైటీ ధరించాను. ఆ కంఫర్ట్ వర్ణనాతీతం. ఇక ఆ నైటీ వేసుకున్న తర్వాత అప్పుడే నేను హీరోయిన్ గా ఒక ఎత్తుకు ఎదిగాను అనిపించింది" అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా లిటిల్ హార్ట్స్ సినిమాతోనే తన నైటీ డెబ్యూ జరిగిపోయిందని చెప్పి అందరిని నవ్వించింది శివాని నాగారం. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.