Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి!

విషయంలోకి వెళ్తే.. సెప్టెంబర్ 5వ తేదీన లిటిల్ హార్ట్స్ సినిమా విడుదలైన విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   9 Sept 2025 3:33 PM IST
టాలీవుడ్ లో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి!
X

మిగతా భాష ఇండస్ట్రీలతో పోల్చుకుంటే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అవకాశాలు చాలా తక్కువగా ఇస్తారని.. ఇప్పటికే ఎంతోమంది ఈ విషయంపై తమ గొంతును వినిపించారు. ముఖ్యంగా అంజలి, అనన్య నాగళ్ళ ఇలా ఎంతోమంది తెలుగు హీరోయిన్స్ సత్తా చాటే ప్రయత్నం చేశారు కానీ సొంత భాషలో అవకాశాలు రాకపోవడంతో పరాయి భాషలో అవకాశాలు అందుకొని.. అక్కడ స్టార్ హీరోయిన్ లుగా చలామణి అవుతున్నారు. కానీ ఇప్పుడిప్పుడే తెలుగు హీరోయిన్లు కూడా టాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు.


అందులో భాగంగానే బేబీ సినిమాతో సంచలనం సృష్టించి అందరి దృష్టిని ఆకట్టుకుంది వైష్ణవి చైతన్య. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో తెలుగమ్మాయి కూడా వచ్చి చేరింది. ఆమె శివాని నాగారం. తాజాగా వచ్చిన 'లిటిల్ హార్ట్స్' అనే సినిమాతో సరికొత్త విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ చిన్నది. అసలు విషయంలోకి వెళ్తే... షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ మొదలుపెట్టి ఇప్పుడు బిగ్ స్క్రీన్ లో సత్తా చాటుతూ ముందుకు వెళ్తోంది హైదరాబాదీ అమ్మాయి. ప్రస్తుతం 90స్ బయోపిక్ ఫేమ్ మౌళి సరసన లిటిల్ హార్ట్స్ సినిమాలో కాత్యాయని పాత్ర పోషించి యువ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు పెద్ద పెద్ద స్టార్ సెలబ్రిటీల చిత్రాలకు పోటీగా నిలిచి స్వదేశీ ప్రతిభ బలంగా నిలబడగలదు అని నిరూపించింది ఈ ముద్దుగుమ్మ.


విషయంలోకి వెళ్తే.. సెప్టెంబర్ 5వ తేదీన లిటిల్ హార్ట్స్ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు పోటీగా అనుష్క 'ఘాటీ' , శివ కార్తికేయన్ 'మదరాసి' చిత్రాలు విడుదలయ్యాయి. ఈ ఇద్దరి బడా సెలబ్రిటీల చిత్రాలను కూడా వెనక్కి నెట్టి రూ.12 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది ఈ సినిమా.దీంతో టాలెంట్ ఉంటే ఏ భాషలో అయినా సత్తా చాటవచ్చు అని మరొకసారి తెలుగమ్మాయి నిరూపించింది అంటూ పలువురు ఈమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈమె ఎవరు? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయాలు కూడా ఆరా తీస్తున్నారు..


శివాని నాగారం విషయానికి వస్తే.. ఈమె నటి మాత్రమే కాదు క్లాసికల్ డాన్సర్ అలాగే గాయని కూడా..1988 హైదరాబాదులో పుట్టిన ఈమె చిన్నప్పటి నుంచే కూచిపూడి నేర్చుకుంది. విల్లా మేరీ కాలేజీలో కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసిన ఈమె.. 'అంతర్గత' అనే షార్ట్ ఫిలిమ్ తో నటిగా మారింది. ఇక 2020లో మిస్టర్ గర్ల్ ఫ్రెండ్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇంస్టాగ్రామ్ లో ఈ మెసేజ్ చేసిన ఫోటోలు చూసిన దర్శకులు 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్' చిత్రంలో అవకాశం కల్పించారు. ఆ తర్వాత జాతి రత్నాలు సినిమాలో కూడా ఒక చిన్న పాత్ర పోషించింది.సంగీతంలో ప్రావీణ్యం ఉన్న ఈమె ఖాళీ సమయంలో పిల్లలకు మ్యూజిక్, డాన్స్ నేర్పిస్తూ ఉంటుంది .


అలాగే తమ్ముడితో కలిసి పాటలు పాడుతూ.. అటు సోషల్ మీడియాలో కూడా వీటిని పోస్ట్ చేస్తూ భారీ పాపులారిటీ అందుకుంది. ప్రస్తుతం సుహాస్ తో కలిసి ' హే భగవాన్' అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. మొత్తానికి అయితే సరైన పాత్ర పడి అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె శ్రీ గౌరీ ప్రియ, వైష్ణవి చైతన్య వంటి కొత్త తరం తెలుగు హీరోయిన్ల జాబితాలో చేరిపోయిందని చెప్పవచ్చు.