సాయి పల్లవిలా సక్సెస్ అయితే సాధ్యమే!
ఈ మధ్య కాలంలో తెలుగు అమ్మాయిల్ని గుర్తించి అవకాశాలివ్వడం కూడా పెరిగింది.
By: Srikanth Kontham | 29 Sept 2025 9:43 AM IST`అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్` తో టాలీవుడ్ కి పరిచయమైంది శివానీ. తెలుగు అమ్మాయి తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. సహజ నటనతో ఆకట్టుకుంది. ఇటీవలే రిలీజ్ అయిన `లిటిల్ హార్స్ట్` తో నూ మరో సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో అమ్మడు కుర్రకారుకు మరింత రీచ్ అయింది. అప్పటికే బ్యూటీ సోషల్ మీడియా యాక్టివిటీతో బాగానే పాపులర్ అయింది. ఆ ఫాలోయింగ్ సక్సస్ లు తోడయ్యే సరికి పాపులారిటీ రెట్టింపు అయింది. ఈనేపథ్యంలో భవిష్యత్ లో మంచి అవకాశాలు అందుకుంటుంది? అన్న కాన్పిడెన్స్ తనలో కనిపిస్తోంది.
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు:
ఈ మధ్య కాలంలో తెలుగు అమ్మాయిల్ని గుర్తించి అవకాశాలివ్వడం కూడా పెరిగింది. ట్యాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేయడానికి నవతరం నిర్మాతలు ముందుకొస్తున్నారు. మునుపటిలా టాలీవుడ్ ఇప్పుడు తెలుగు అమ్మాయిల్ని దూరం పెట్టడం లేదు. ప్రతిభతో పాటు పాత్రకు సెట్ అవుతుందంటే ఎంపిక చేస్తున్నారు. అప్పటికే యూట్యూబ్ వంటి మాధ్యమాల్లో తమని ప్రూవ్ చేసుకునే ఆధారాలు కూడా ఉండటంతో అవకాశాలు సులభం అవుతున్నాయి. శివానీ కెరీర్ ఇప్పుడే మొదలైన నేపథ్యంలో ఆమెకు తగ్గ అవకాశాలు అందుకుంటుందని అభిమానులు ఆశీస్తున్నారు.
అలాగైతే అవకాశాలు కష్టం:
కానీ శివానీ మాత్రం గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటానంటూ కండీషన్ పెట్టింది. అవకాశాల కోసం ఎలా పడితే అలా తెరపై కనిపించడం తనకు ఎంత మాత్రం ఇష్టం ఉండదంది. కథ, అందులో పాత్ర నచ్చితే ఒప్పుకుంటాను తప్ప..అదే సినిమాలో గ్లామర్ గా కనిపించాలి అనే కండీషన్లు పెడితే మాత్రం అవకాశం వదులకోవడానికి ఎంత మాత్రం ఆలోచించనంది. హీరోయిన్ అంటే అందాల ఆరబోత అనే విధానాన్ని తాను ఎంత మాత్రం నమ్మ నంటోంది. కానీ ఈ కండీషన్ తో సినిమాలు చేస్తానంటే అంటే అవకాశాలిచ్చే పరిస్థితి ఉండదు.
సాయి పల్లవిలా సక్సెస్ అయితేనే:
పాత్రకు తగ్గట్టు హీరోయిన్ గ్లామర్ గా కనిపించాలని దర్శకుడు పట్టుబట్టే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో దర్శకుడు రాజీ పడే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో మాత్రం అవకాశాలు కోల్పోవడం తప్పదు. అది మొత్తం కెరీర్ పైనే పడుతుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే నటీమణుల్ని ఎంపిక చేసుకోవడానికి ఏ దర్శకుడు ముందుకురాడు. స్టార్ హీరోయిన్లగా వెలిగిన వారే చివరికు దిగొచ్చి కండీషన్లు అప్లై అనే నిబంధన తొలగించి పని చేస్తున్నారు. శివానీ అనుకున్నది జరగాలంటే సాయి పల్లవిలా సక్సెస్ అయితే సాధ్యమే.
