అదంతా అపోహ.. ఇండస్ట్రీని నిందించడం కరెక్ట్ కాదు
కానీ వాటి గురించి ఎవరూ మాట్లాడరని, మూవీ టికెట్ రేట్ రూ.100 పెరిగినా అందరూ ఇండస్ట్రీని విలన్ గా చూపిస్తారని అసహనం వ్యక్తం చేశారు.
By: Sravani Lakshmi Srungarapu | 24 Nov 2025 7:26 PM ISTక్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి యూత్ హీరోగా ఎన్నో ఏళ్ల పాటూ ఆడియన్స్ ను అలరించిన శివాజీ కొంతకాలం పాటూ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. రీసెంట్ గా కోర్టు మూవీతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన శివాజీ ఆ సినిమాలో చేసిన మంగపతి పాత్ర బాగా ఆకట్టుకోవడంతో ఆయన పేరు మార్మోగి పోయింది. శివాజీ యాక్టర్ గానే కాకుండా తన మాటలు, నిజాయితీగా తన అభిప్రాయాలను వెల్లడిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న పరిణామాలపై ఆయనో ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఐబొమ్మ రవి విషయంపై నోరు విప్పిన శివాజీ దేశ చట్టాలకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా శిక్ష తప్పదన్నారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుని పోతుందని శివాజీ స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో అందరూ లగ్జరీ జీవితాన్నే గడపరని కూడా శివాజీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
ఇండస్ట్రీలో అందరూ నార్మల్ లైఫ్ నే గడుపుతున్నారు
ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ లగ్జరీ లైఫ్ ను గడుపుతారనేది ఓ అపోహ మాత్రమేనని, 5% మంది మాత్రమే లగ్జరీగా జీవిస్తున్నారని, వాళ్లను చూసి ఇండస్ట్రీ మొత్తాన్ని నిందించడం సరైన పద్దతి కాదని, అందరూ థియేటర్లలో టికెట్ రేట్లు పెరిగాయని విమర్శిస్తున్నారన్నారు. సంక్రాంతి టైమ్ లో, పెద్ద పెద్ద పండగలప్పుడు బస్సు టికెట్ ధరలు మూడింతలు పెరుగుతాయన్నారు.
కంటెంట్ బావుంటే చిన్న సినిమాలను కూడా ఆదరిస్తారు
కానీ వాటి గురించి ఎవరూ మాట్లాడరని, మూవీ టికెట్ రేట్ రూ.100 పెరిగినా అందరూ ఇండస్ట్రీని విలన్ గా చూపిస్తారని అసహనం వ్యక్తం చేశారు. ఎప్పుడైనా సినిమాలోని కంటెంట్ బావుంటే చిన్న సినిమాలను కూడా ఆడియన్స్ ఆదరిస్తారని చెప్పిన శివాజీ థియేటర్లలో అమ్మే పాప్‌కార్న్‌లు హెల్త్ కు మంచివి కావని, వాటిని తినకపోవడమే బెస్ట్ అని ఆడియన్స్ కు సూచించారు.
