Begin typing your search above and press return to search.

శివాజీకి మరో బిగ్ షాక్?

శివాజీ ఇప్పటికే ఈ విషయంపై స్పందిస్తూ ఒక వీడియో ద్వారా బేషరతుగా క్షమాపణలు చెప్పారు. తన ఉద్దేశం మంచిదేనని, ఆవేశంలో పదాలు దొర్లాయని క్లారిటీ ఇచ్చారు.

By:  M Prashanth   |   23 Dec 2025 11:39 PM IST
శివాజీకి మరో బిగ్ షాక్?
X

'దండోరా' సినిమా ఈవెంట్ లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు రేపిన దుమారం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో మొదలైన రచ్చ ఇప్పుడు మరో స్థాయికి వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటి నుంచి ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండగా, తాజాగా ఈ వ్యవహారం మహిళా కమిషన్ దృష్టికి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో శివాజీ చుట్టూ ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. శివాజీ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు నోటీసులు కూడా పంపినట్లు ఒక వార్త బలంగా వినిపిస్తోంది. హీరోయిన్ల వస్త్రధారణపై ఆయన చేసిన కామెంట్స్, వాడిన భాషపై అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.

ప్రచారంలో ఉన్న వివరాల ప్రకారం.. ఈ నెల 27వ తేదీన అంటే ఎల్లుండి ఉదయం 11 గంటలకు శివాజీ మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. కమిషన్ కార్యాలయానికి వచ్చి, ఆయన చేసిన వ్యాఖ్యలకు, 'సామాన్లు', 'దరిద్రపు..' వంటి పదజాలానికి సంజాయిషీ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు టాక్ నడుస్తోంది.

శివాజీకి నోటీసులు వచ్చాయనే వార్త వైరల్ అవుతున్నప్పటికీ.. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. అటు మహిళా కమిషన్ నుంచి గానీ, ఇటు శివాజీ తరపు నుంచి గానీ దీనిపై అఫీషియల్ గా ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు. ఇది నిజంగా జరిగిందా లేక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమా? అనేది తెలియాల్సి ఉంది.

శివాజీ ఇప్పటికే ఈ విషయంపై స్పందిస్తూ ఒక వీడియో ద్వారా బేషరతుగా క్షమాపణలు చెప్పారు. తన ఉద్దేశం మంచిదేనని, ఆవేశంలో పదాలు దొర్లాయని క్లారిటీ ఇచ్చారు. ఆయన వివరణ ఇచ్చిన తర్వాత కూడా కమిషన్ నోటీసులు ఇచ్చిందా అనేది సందేహంగానే ఉంది. ఒకవేళ నోటీసులు నిజమే అయితే, శివాజీ మరోసారి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ నోటీసుల వ్యవహారంపై శివాజీ గారు గానీ, ఆయన టీమ్ గానీ స్పందిస్తే తప్ప అసలు నిజం బయటకు రాదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మాత్రం దీనిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇది కేవలం రూమర్ మాత్రమేనా లేక నిజంగానే ఆయన కమిషన్ మెట్లు ఎక్కబోతున్నారా అనేది తెలియాలంటే.. శివాజీ అఫీషియల్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.