ఇంతకీ జూమ్ మీటింగ్ పెట్టుకుంది ఎవరు?
ఈవెంట్‌లో నేను చేసిన కామెంట్స్‌కు మహిళా కమీషన్ నోటీసులు ఇచ్చింది` అన్నారు. ఇదే సమయంలో తనపై కుట్ర జరుగుతోందని శివాజీ చెప్పడం ఇప్పుడు కొత్త చర్చకు తెరతీస్తోంది. `నాపై కుట్ర జరుగుతోంది.
By: Tupaki Entertainment Desk | 27 Dec 2025 6:34 PM ISTమహిళల డ్రెస్సింగ్‌పై `దండోరా` ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పందం అయిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వైరల్‌గా మారి తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో నష్టనివారణ చర్యలకు దిగిన శివాజీ వెంటనే తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూనే క్షమాపణలు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు తెలంగాణ మహిళా కమీషన్ నోటీసులు పంపించింది. ఆదేశాలు అందుకున్న వెంటనే శివాజీ మహిళా కమీషన్ చైర్‌పర్సన్ శారద ముందు హాజరయ్యారు.
వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అయితే ఈ సందర్భంగా శివాజీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నేను ఏం తప్పు చేశానని నామీద ఇంత కోపం. మీ అమ్మానాన్న మీ ఇంట్లో జాగ్రత్తలు చెప్పరా? ఎవరు ఎలాంటి దుస్తులు వేసుకుంటే నాకేంటీ? ఎవరి దుస్తులు వారిష్టం. ఇంతకు ముందు ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదా? వారి మీద ఇలానే మాట్లాడారా? సినిమా ప్రమోషన్ కోసం అని కూడా కొందరు ప్రచారం చేస్తున్నారు.
ఈవెంట్‌లో నేను చేసిన కామెంట్స్‌కు మహిళా కమీషన్ నోటీసులు ఇచ్చింది` అన్నారు. ఇదే సమయంలో తనపై కుట్ర జరుగుతోందని శివాజీ చెప్పడం ఇప్పుడు కొత్త చర్చకు తెరతీస్తోంది. `నాపై కుట్ర జరుగుతోంది. నాతో కెరీర్ మొదలు పెట్టిన వారికి నాపై కోపం ఉంది. నా వ్యాఖ్యల తరువాత నన్ను ఇబ్బంది పెట్టాలని కొంత మంది జూమ్ మీటింగ్ పెట్టుకుని చర్చించారు. నాకు బాగా కావాల్సిన వారు నాపై ఇంత కుట్ర చేస్తారని అనుకోలేదు` అంటూ బాంబు పేల్చాడు శివాజీ.
ఇంతకీ శివాజీపై కుట్ర చేస్తున్నది ఎవరు? తనని ఇండస్ట్రీలో తొక్కేయాలని, ఇబ్బందులు గురి చేయాలని జూమ్ మీటింగ్ పెట్టి మరీ ప్లాన్ చేస్తున్నది ఎవరు?..శివాజీ తనతో కెరీర్ ప్రారంభించిన వారే అని ప్రత్యేకంగా నొక్కి చెబుతున్నది ఎవకరి గురించి? ..నాకు బాగా కావాల్సిన వాళ్లే నాపై కుట్ర చేస్తారని అనుకోలేదని శివాజీ అంత పర్‌ఫెక్ట్‌గా చెబుతోంది ఎవరి గురించి. తాజా వివాదాన్ని ఈ స్థాయికి తీసుకురావాల్సిన అవసరం ఎవరికి ఉంది?..అనసూయ నుంచి నాగబాబు.. ప్రకాష్ రాజ్ వరకు శివాజీ వ్యాఖ్యలపై ఎందుకు ఇంతగా స్పందిస్తున్నారు?
అనేది ఇప్పుడు కొత్త చర్చకు తెరతీస్తోంది. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన శివాజీ ఈటీవీ విన్‌లో విడుదలైన `90స్`తో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం.. చేసిన తొలి సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ అయి మళ్లీ శివాజీ ఫామ్‌లోకి రావడం.. రీసెంట్‌గా వడుదలైన `దండోరా` కూడా హిట్టు కావడం ఇండస్ట్రీలోని కొంత మందికి కంటగింపుగా మారిందా?..
రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పవన్‌కల్యాణ్ గురించి పాజిటివ్‌గా మాట్లాడిన శివాజీపై నాగబాబు అంతగా ఫైర్ కావాల్సిన అవసరం ఎందుకొచ్చింది?.. వర్మ అన్నాడంటే అది వేరే విషయం.. లేడీ అంటే వర్మ వ్యవహరించే తీరు వేరుగా ఉంటుంది. కానీ ప్రకాష్ రాజ్ కేవలం అటెన్షన్ కోసమే శివాజీపై విమర్శలు చేశాడా? అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
