Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌లో అప్ప‌టికీ ఇప్ప‌టికీ మార్పు అదేన‌ట‌!

ప‌వ‌న్‌క‌ల్యాణ్ తో క‌లిసి శివాజీ `ఖుషి`, జ‌ల్సా సినిమాల్లో న‌టించిన విష‌యం తెలిసిందే. అప్ప‌టికీ ఇప్ప‌టికీ ప‌వ‌న్‌లో గ‌మ‌నించిన తేడా ఏంట‌ని అడిగితే శివాజీ ఆస‌క్తిక‌రంగా స్పందించారు.

By:  Tupaki Entertainment Desk   |   20 Dec 2025 6:23 PM IST
ప‌వ‌న్‌లో అప్ప‌టికీ ఇప్ప‌టికీ మార్పు అదేన‌ట‌!
X

కొన్నేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు న‌టుడు శివాజీ. త‌న పిల్ల‌ల కోరిక మేర‌కు మ‌ళ్లీ న‌టించ‌డం మొద‌లు పెట్టిన ఆయ‌న వ‌రుస‌గా విభిన్న‌మైన పాత్ర‌ల్ని, చిత్రాల్ని ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నారు. నేచుర‌ల్ స్ట‌ర్ నాని నిర్మించిన `కోర్ట్‌` మూవీలో మంగ‌ప‌తి క్యారెక్ట‌ర్‌తో అద‌ర‌గొట్టిన శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ తొలి ప్ర‌య‌త్నంలోనే న‌టుడిగా అన్ని వ‌ర్గాల చేత శ‌భాష్ అనిపించుకున్నారు. కేవ‌లం రూ.4 కోట్ల‌తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది.

ఈ సినిమా అందించిన స‌క్సెస్‌ని దృష్టిలో పెట్టుకుని శివాజీ సెలెక్టీవ్‌గా సినిమాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం `కూర్మ‌నాయ‌`కితో పాటు ల‌య‌తో `సంప్ర‌దాయ‌నిసుప్పిని సుద్ద‌పూస‌నీ`, భూమిక‌తో మ‌రో మూవీతో పాటు `దండోరా`లో న‌టిస్తున్నాడు. ఇందులో `దండోరా` ఈ నెల 25న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇందులో శివాజీ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ సంద‌ర్భంగా ఓ మీడియాతో మముచ్చ‌టిస్తూ స్టార్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై శివాజీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ తో క‌లిసి శివాజీ `ఖుషి`, జ‌ల్సా సినిమాల్లో న‌టించిన విష‌యం తెలిసిందే. అప్ప‌టికీ ఇప్ప‌టికీ ప‌వ‌న్‌లో గ‌మ‌నించిన తేడా ఏంట‌ని అడిగితే శివాజీ ఆస‌క్తిక‌రంగా స్పందించారు. అప్ప‌టికీ ఇప్ప‌టికీ చాలా మార్పు చెందిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని చూస్తున్నాను. ఎమోష‌న‌ల్‌గా పీక్స్ ఆయ‌న‌. ఎదైనా ఎమోష‌న‌ల్‌గా తీసుకున్నాడంటే పీక్స్ వ‌ర‌కు వెళ‌తారాయ‌న‌. ఆ విష‌యంలో ఇప్పుడు ఆయ‌న చాలా పేషెన్సీతో జాగ్ర‌త్త‌గా త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తును నిర్మించుకుంటున్నాడు. అది ఆయ‌న‌కీ మంచిది.. స‌మాజానీకీ మంచిది. ఆయ‌న ఇంటెన్ష‌న్స్ ఎక్క‌డా బ్యాడ్‌గా క‌నిపించ‌ట్లేదు.డూయింగ్ గుడ్ గోయింగ్ వెల్ లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

40 ఏళ్ల త‌రువాతైనా అవి ఫ్రెషే...

ప‌వ‌న్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన శివాజీ త‌న‌కు ల‌వ్‌స్టోరీస్ తీయ‌డం అంటే మ‌హా ఇష్ట‌మ‌ని అస‌లు సీక్వెట్ బ‌య‌ట‌పెట్టాడు. త‌న వ‌ద్ద రీమేక్‌ల కోసం రైట్స్ తీసుకుని దాచిన మూడు సినిమాలున్నాయ‌ట‌. వాటిని రీమేక్ చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. ఇప్పుడు రీమేక్‌లు ఎవ‌రు చూస్తార‌నే అనుమానం లేద‌ని, అవి ఓటీటీల‌కు రాలేద‌ని, వాటిని 40 ఏళ్ల త‌రువాత రీమేక్ చేసినా ఫ్రెష్‌గానే ఉంటాయ‌ని, అవి ఎవ‌ర్‌గ్రీన్ స్క్రిన్‌ప్లేతో రూపొందిన సినిమాల‌ని వాటిని క‌చ్చితంగా తీస్తానంటున్నాడు.