Begin typing your search above and press return to search.

ఐ బొమ్మ రవి టాలెంట్ విని షాకయ్యా.. దేశానికి ఉపయోగపడితే!: శివాజీ

ఇప్పుడు సినీ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

By:  M Prashanth   |   18 Nov 2025 9:00 AM IST
ఐ బొమ్మ రవి టాలెంట్ విని షాకయ్యా.. దేశానికి ఉపయోగపడితే!: శివాజీ
X

పైరసీ వెబ్ సైట్ ఐ బొమ్మ రవిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతడితోనే ఐ బొమ్మ, బప్పం టీవీ వెబ్ సైట్లు కూడా క్లోజ్ చేయించారు. ఆ విషయంపై ఇప్పటికే అనేక మంది టాలీవుడ్ ప్రముఖులు రెస్పాండ్ అయ్యి మాట్లాడగా.. ఇప్పుడు సినీ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

శివాజీ ప్రస్తుతం దండోరా మూవీ చేస్తుండగా.. వచ్చే నెల 25వ తేదీన ఆ సినిమా విడుదల కానుంది. దీంతో మేకర్స్ రీసెంట్ గా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా.. వేదికపై శివాజీ మాట్లాడారు. ఆ సమయంలో సినిమా గురించి మాట్లాడాక, ఐ బొమ్మ రవి గురించి ప్రస్తావించారు. పేరును ప్రస్తావించకుండా పలు వ్యాఖ్యలు చేశారు.

తాను అతని టాలెంట్ చూసి ఆశ్యర్యపోయానని తెలిపారు శివాజీ. "మొత్తానికి అతన్ని పట్టేశారు.. వాడికేది కసి.. దాన్ని మంచి పనికి వాడుకోవాలని కోరుకుంటున్నాను. ఆ అబ్బాయి మంచి హ్యాకర్ అని విన్నాను. దేశానికి ఉపయోగపడే వాడిగా మారితే అయితే బాగుంటుంది. టాలెంట్ ఎవరి సొత్తు కాదని ప్రూవ్ చేశాడు" అని శివాజీ వ్యాఖ్యానించారు.

"ఏదేమైనా అతను చేసిన పని దుర్మార్గమైనదే. కానీ టాలెంట్ గురించి విని షాకయ్యాను. దేశానికి పనికొస్తాడని అనిపిస్తుంది.. ఎక్కడైనా సెక్యూరిటీ సిస్టంలో యూజ్ చేసుకోవచ్చని అనిపించింది. తెలిసీ తెలియని వయసు. డబ్బు లేని తనం. అవన్నీ వెంటపడి అలాంటి ఆలోచన వచ్చి చాలా మందికి ఇబ్బంది పెట్టాడు" అని తెలిపారు.

"కానీ అతను చాలా మందికి ఉపయోగపడుతున్న అని అనుకున్నాడు. కానీ మనకంటూ రాజ్యాంగం ఉంది. దానికి అందరూ లోబడి బతకాలి. దాన్ని వదిలేసి అలా చేశాడు. ఇక నుంచి మారాలాని అనుకుంటున్నా. సినిమా థియేటర్స్ ఎక్స్పీరియన్స్ ఎక్కడా చూసిన రాదు. ప్రపంచంలోనే సినిమానే చీప్" అని శివాజీ చెప్పుకొచ్చారు.

"మూడు గంటల సినిమా మనకు నచ్చితే జీవితాంతం గుర్తుంటుంది. ఎన్టీఆర్‌ మిస్సమ్మ, పాతాళ భైరవి చిత్రాలు ఇప్పటికీ అందరికీ గుర్తున్నాయి. మనం సినిమా చూడడానికి రూ.200 ఖర్చు పెడతాం. కానీ ఆ మూవీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే అందరూ థియేటర్‌ లోనే సినిమా చూడండి. ఒక్కో మూవీ కోసం చాలా మంది కష్టపడి పని చేస్తారు. అందుకే పైరసీని ప్రోత్సహించొద్దు" అంటూ శివాజీ కోరారు.