మెగాస్టార్‌పై మిమిక్రీ ఆర్టిస్ట్ పిచ్చి ప్రేమ.. ఏకంగా 20 నుంచి
సినీ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు కూడా సాధారణ మనుషుల్లాంటి వారే. వారిక్కూడా ఇష్టాలు, అభిప్రాయాలు, అభిరుచులు ఉంటుంటాయి.
By: Sravani Lakshmi Srungarapu | 2 Oct 2025 10:00 PM ISTసినీ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు కూడా సాధారణ మనుషుల్లాంటి వారే. వారిక్కూడా ఇష్టాలు, అభిప్రాయాలు, అభిరుచులు ఉంటుంటాయి. అయితే కొందరు ఆ ఇష్టాలను బయటపెట్టకుండా మనసులోనే దాచుకుంటే మరికొందరు మాత్రం తమ ఇష్టాలను అందరికీ తెలియచెప్తూ, తమ గురించి అందరూ మాట్లాడుకునేలా చేస్తూ ఉంటారు.
అయితే సెలబ్రిటీలు అయినంత మాత్రాన వారేం ఆకాశం నుంచి దిగి రారు. వారిక్కూడా అందరిలానే ఫేవరెట్ హీరోలు, హీరోయిన్లు, ఇష్టమైన భోజనం ఇలా ఉంటాయి. అయితే అందరూ ఒకేలా తమ ఇష్టాన్ని చూపించాలనేమీ లేదు. ఒక్కొక్కరు ఒక్కోలా తమ ఇష్టాన్ని బయటపెడుతూ ఉంటారు. కొందరు తమ ఇష్టాన్ని మాటల ద్వారా చెప్పగలిగితే, ఇంకొందరు తమ ఇష్టాన్ని చేతల ద్వారా చూపిస్తూ ఉంటారు.
మెగాస్టార్ పై శివా రెడ్డి వీరాభిమానం
టాలీవుడ్ కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ శివా రెడ్డి కూడా ఈ కోవలోకే వస్తారు. శివా రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో ఇష్టం. చిరూపై తనకున్న ఇష్టాన్ని శివా రెడ్డి చాలా డిఫరెంట్ గా చూపిస్తున్నారు. రీసెంట్ గా శివా రెడ్డి ఓ డిజిటల్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో ఆయన తన ఇంటిని చూపించారు. ఇంట్లోని అవార్డులను చూపిస్తున్న క్రమయంలో అక్కడ అందరినీ ఓ టీ కప్ ఎట్రాక్ట్ చేసింది.
20 ఏళ్లుగా దాచుకున్న టీ కప్
కేవలం టీ కప్ మాత్రమే కాకుండా అందులో ఓ స్టార్ సింబల్ కూడా ఉండటంతో అదేంటని శివా రెడ్డిని అడగ్గా, అది మెగాస్టార్ చిరంజీవి తాగిన టీ కప్పు అని, ఆయన గుర్తుగా దాన్ని 20 ఏళ్లుగా దాచుకుంటూ వస్తున్నానని, చిరంజీవి మెగాస్టార్ కాబట్టి, ఆ కప్ లో స్టార్ సింబల్ ను పెట్టానని చెప్పిన శివారెడ్డి, లక్షల రూపాయలు ఇచ్చినా కూడా ఆ టీ కప్ ను తాను ఎవరికీ ఇవ్వను తెలిపారు. ఆ వీడియో చూసి ఎంతో మంది ఫ్యాన్స్ ను చూశాం కానీ ఇదేం పిచ్చి అంటూ శివారెడ్డి అభిమానాన్ని ఉద్దేశించి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
