శివ రీ రిలీజ్.. బిగ్ బాస్ ని బాగా వాడేస్తున్నారు..!
ఐతే అన్ని సినిమాలు రీ రిలీజ్ ఒక లెక్కైతే శివ రీ రిలీజ్ మరో లెక్క. ఎందుకంటే తెలుగు సినిమా అంటే బిఫోర్ శివ ఆఫ్టర్ శివ అని ఎందుకంటారు అన్నది ఈ సినిమా చూస్తే అర్ధమవుతుంది.
By: Ramesh Boddu | 11 Nov 2025 11:16 AM ISTకింగ్ నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన సెన్సేషనల్ మూవీ శివ. 1989 లో రిలీజైన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమాగా రికార్డ్ సృష్టించింది. అప్పటివరకు ఉన్న మూస థోరణి సినిమాలను బ్రేక్ చేస్తూ ఆర్జీవి స్టైల్ టేకింగ్ తో శివ చేసిన బీభత్సం అంతా ఇంతా కాదు. దాదాపు 36 ఏళ్ల తర్వాత శివ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈమధ్య స్టార్ సినిమాలన్నీ రీ రిలీజ్ అవుతున్నాయి. వాటి దారిలోనే శివ రీ రిలీజ్ ప్లాన్ చేశారు.
అన్ని సినిమాలు రీ రిలీజ్ ఒక లెక్కైతే శివ రీ రిలీజ్ మరో లెక్క..
ఐతే అన్ని సినిమాలు రీ రిలీజ్ ఒక లెక్కైతే శివ రీ రిలీజ్ మరో లెక్క. ఎందుకంటే తెలుగు సినిమా అంటే బిఫోర్ శివ ఆఫ్టర్ శివ అని ఎందుకంటారు అన్నది ఈ సినిమా చూస్తే అర్ధమవుతుంది. 36 ఇయర్స్ బ్యాక్ సినిమా అంటే ఓ విధంగా చెప్పాలంటే ఇప్పటి యూత్ కి ఈ సినిమా పేరు ఎప్పుడు వినపడుతుంది కానీ అసలు ఎందుకు ఆ సినిమాకు అంత పిచ్చెక్కిపోతారు అన్నది తెలియదు. అది తెలియపరచడం కోసమే ఈ సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు.
శివ సినిమా 4K ప్రింట్ ఈ నెల 14న రీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కోసం ఆర్జీవి మళ్లీ 8 నెలల పాటు వర్క్ చేశారని కింగ్ నాగార్జున చెప్పారు. ఇక సినిమా రీ రిలీజ్ మరింత ప్రేక్షకులకు రీచ్ అవ్వాలని నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ లో కూడా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఒక సినిమా రీ రిలీజ్ కోసం బిగ్ బాస్ లో ప్రమోషన్స్ చేయడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. ఆర్జీవి తో పాటు అమల కూడా వచ్చి బిగ్ బాస్ లో శివ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.
తెలుగు సినిమా బిఫోర్ శివ ఆఫ్టర్ శివ..
వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున శివ ప్రమోషన్స్ లో భాగంగా ఆ సినిమాలోని సాంగ్స్ తో కంటెస్టెంట్స్ అందరితో ఒక మెడ్లీ పర్ఫార్మెన్స్ ఇప్పించారు. బిగ్ బాస్ చూసే ఆడియన్స్ అందరికీ శివ రీ రిలీజ్ అవుతుంది.. అది చూసేయాలి అనే రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. లేటెస్ట్ గా శివ రీ రిలీజ్ సందర్భంగా యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ తో నాగార్జున, ఆర్జీవి స్పెషల్ ఇంటర్వ్యూ ఒకటి ప్లాన్ చేశారు.
సో బిగ్ బాస్ ని తన సినిమా రిలీజ్ ప్రమోషన్స్ కి వాడటం చూస్తుంటే నాగార్జున శివ సినిమాను ఎంత పర్సనల్ గా తీసుకున్నారు అన్నది అర్ధం చేసుకోవచ్చు. శివ రీ రిలీజ్ కచ్చితంగా అక్కినేని ఫ్యాన్స్ కి మరోసారి మాస్ ఫీస్ట్ అందిస్తుందని చెప్పొచ్చు. మరి నవంబర్ 14న రీ రిలీజ్ అవుతున్న శివ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుంది అన్నది చూడాలి.
తెలుగు సినిమా బిఫోర్ శివ ఆఫ్టర్ శివ అనే మాట ఎందుకు ఎలా వచ్చింది అన్నది తెలియాలంటే శివని టీవీల్లో, ఓటీటీలో చూడటం కాదు థియేటర్ లో చూసి ఆన్సర్ తెలుసుకోవాల్సిందే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.
